టిఆర్ఎస్ పార్టీలో చేరికలు..

టిఆర్ఎస్ పార్టీలో చేరికలు..

1
TMedia (Telugu News) :

టిఆర్ఎస్ పార్టీలో చేరికలు..
టీ మీడియా, మార్చి 11 ,ఖమ్మం: నగరంలోని స్థానిక గ్రానైట్ పరిశ్రమ ఏరియాలో కార్మికులు బరి ఎత్తున టిఆర్ఎస్ లోకి చేరిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగర పార్టి ఆధ్యక్షుడు పగడల నాగరాజు హాజరై ఇతర పార్టి నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి టీఆర్ఎస్ పార్టి కండువా కప్పి ఆహ్వానించారు.చేరిన వారిలో ఒంప్రకష్,వెంకన్న,చోట రాము, వీరితో పాటు 60 మంది కార్మికులు చేరటం జరిగింది.ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ:- తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది గమనించాలన్నారు.అలాగే మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం నగరాన్ని రోల్ మోడల్ సిటీగా తీర్చిదిద్దారు,తీర్చిదిద్దిన ఘనత అజయ్ కుమార్ గారిదని సభాముఖంగా తెలియజేశారు.

Also Read : భాజపా శ్రేణులు సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సహకారంతో ప్రతి ఒక సంక్షేమ పథకం ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నారని అన్నారు.కావున అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పని చేసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు చేపట్టే అభివృద్ధి గురించి ప్రజలకు చేరే విధంగా తెలియజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దండా జ్యోతి రెడ్డి,దోరేపల్లి శ్వేత,నగర అధ్యక్షులు పాల్వంచ కృష్ణ,కేవీ నాయకులు పాషా,బీసీ సెల్ నగర అధ్యక్షులు మేకల సుగునారావు,గ్రానైట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాములు,డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జోగుపర్తి ప్రభాకర్,కార్యదర్శి షేక్ వలి,వొంటికొమ్ము శ్రీనివాస్ రెడ్డి,తీగల సతీశ్ గౌడ్,మల్లేష్ బిక్ష్మం,సుధాకర్,మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube