అధికార పార్టీ క్రైమ్ కార్పొరేటర్ల పై అనర్హత వేటు వేయాలి

అధికార పార్టీ క్రైమ్ కార్పొరేటర్ల పై అనర్హత వేటు వేయాలి

1
TMedia (Telugu News) :

అధికార పార్టీ క్రైమ్ కార్పొరేటర్ల పై అనర్హత వేటు వేయాలి

దాడి జరిగిన మహిళ కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ నాయకులు.

దాడులకు పాల్పుడుతున్న అధికార పార్టీ కార్పొరేటర్ల పై పిడి ఆక్ట్ అమలు చేయాలి.

టీ మీడియా,జూన్ 14, గోదావరిఖని :

రామగుండం నగరపాలక సంస్థలు రోజురోజుకు అధికార పార్టీ చెందినటువంటి కార్పొరేటర్ల ఆగడాలు,ఆర్ధిక నేరాలు, దాడులు,మితిమీరిపోతున్న ఎమ్మెల్యే చూసి చూడనట్లు నటించడం సిగ్గుచేటని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మడ్డి ఎల్లయ్య, సిపిఐ రామగుండం నగర సమితి కార్యదర్శి కె.కనుకరాజ్,సహాయ కార్యదర్శులు తలపెళ్లి మల్లయ్య,మద్దెల దినేష్,రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, తీవ్రంగా విమర్శించారు.ఈ సందర్భంగా సోమవారం రోజున పవర్ హౌస్ కాలనీ లో మూడు రోజుల కింద జరిగినటువంటి మహిళా పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మహిళ కుటుంబాన్ని సిపిఐ నాయకులు పరామర్శించారు.

Also read : ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు

అనంతరం వారు మాట్లాడుతూ…. అధికార పార్టీ కార్పొరేటర్లు అధికార అహంకార పూరితంగా ఈ ప్రాంతంలో రౌడీలు గూండాలుగా వ్యవహరిస్తూ వాపును చూసి బలుపు అనుకోని కార్పొరేటర్లు మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా చిత్తశుద్ధి లేకుండా అసభ్యకరంగా మహిళలపై దురుసుగా ప్రవర్తించి దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. అదే విధంగా సీనియర్ జర్నలిస్టు కుమార్ పై దాడి కూడా నిజంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక కార్పొరేటర్ భర్త నేమో ఒక ప్రాంతంలో హత్య చేస్తారు,ఇంకో కార్పొరేటర్ ఏమో మద్యం ఉచితంగా ఇవ్వలేదని మద్యం షాపు పై అర్ధరాత్రి దాడి చేస్తాడు, మరో కార్పొరేటర్ ఏమో చిత్తుగా తాగి మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తాడు, ఇదేనా అధికార పార్టీ నేతలు చేసేది వారికి ఎమ్మెల్యే గారు ఇలాంటి వాటినినే ప్రోత్సహించేది అని ఎమ్మెల్యే ని ప్రశ్నించారు.నూతన మున్సిపల్ చట్టం (2019) అమలు చేయాలి సెక్షన్ 11 ప్రకారం షెడ్యూల్ – 4 మరియు సెక్షన్ 12 1.1 బీ ప్రకారం జర్నలిస్ట్ ల పై మరియు ఇతర ప్రజల పై దాడి చేస్తే కార్పొరేటర్ ల పై వేటు వేయచ్చు అని కౌన్సిల్ నుండి తొలగించ వచ్చు అని పేర్కొన్నారు.రామగుండం కమిషనరేట్ ప్రాంతంలో అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు నిజంగా సిగ్గుచేటు కమిషనరేట్ ప్రాంతంలో ఎప్పటికప్పుడు భద్రత, నిఘా ఒక భరోసా ఉంటుందని అనుకుంటే నేడు నగర ప్రజలు నగర పౌరులు ముఖ్యంగా మహిళలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు అనేది పోలీసులు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగానికి సూచిస్తున్నాం.కార్పొరేటర్లు నేరాలకు పాల్పడుతూ నగర పౌరులు ఇబ్బందులు పెడుతుంటే నూతన మున్సిపల్ చట్టం ఎందుకు అమలు చేస్తారని సిపిఐ నాయకులు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేసారు.

Also Read : పేద కుటుంబాలకు ఆపద్భాందవుడు

యుద్ధప్రాతిపదికన ఇలాంటి దాడులకు పాల్పడుతున్న అధికార పార్టీ కార్పొరేటర్లు నూతన మున్సిపల్ చట్టం 2019 అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరూపించుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది.రోజు రోజు సెటిల్మెంట్లు గొడవలు అధికార పార్టీ నేతలు పాలుపంచుకోవడం సిగ్గుచేటని రామగుండం నగరపాలక సంస్థ రాష్ట్రవ్యాప్తంగా పరువు తీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా గౌరవ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అదేవిధంగా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ వెంటనే స్పందించి నూతన మున్సిపల్ చట్టం అమలు చేయాలి లేనియెడల వారిపై మున్సిపల్ చట్టం అమలు చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అదే విధంగా ఇలాంటి కార్పొరేటర్ల పై పీడీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేసారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube