వ్యక్తుల కంటే పార్టీకే ప్రాముఖ్యతను ఇవ్వండి

ఎమ్మెల్సీ తాత మధు

1
TMedia (Telugu News) :

వ్యక్తుల కంటే పార్టీకే ప్రాముఖ్యతను ఇవ్వండి: ఎమ్మెల్సీ తాత మధు

టీ మీడియా, మార్చి 26, మధిర:టిఆర్ఎస్ కార్యకర్తలే పార్టీకి శిరోధార్యమని కార్యకర్తలను, నాయకులను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వ్యక్తుల కంటే పార్టీకే ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. శనివారం మధిర మండలం పరిధిలోని దేశినేని పాలెం గ్రామంలో టిఆర్ఎస్ నాయకులు ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వర రావు ను పరామర్శించి అనంతరం వారు నివాసంలో ముఖ్య కార్యకర్తలతో నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. నాయకులు నియమ నిబంధనతో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందర్నీ కలుపుకొని పనిచేయాలని రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మధిర నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ద్వితీయ శ్రేణి నాయకత్వానికి సూచించారు.

Also Read : పరీక్ష సామాగ్రి వితరణ

ఈ సందర్భంగా గ్రామంలోని విద్యుత్ ట్రాన్స్ఫర్ జన వాసుల మధ్య ఉన్నదని దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్సీ తాతా మధు కి టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు. వెంటనే ఈ సమస్యపై సంబంధిత అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని జడ్పీ చైర్మన్ కు కూడా ఈ విషయం చెప్పమని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు కనుమూరు వెంకటేశ్వరరావు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తా రు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మొండితోక జయకర్, జిల్లా రైతు నాయకులు చుంచు విజయ్ రైతుబంధు కన్వీనర్ చాలా వేణుబాబు మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి తాళ్లూరి హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube