*పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలి

*పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలి

0
TMedia (Telugu News) :

*పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలి
– జ్యూట్ బ్యాగులను పంపిణీ
-స్మార్ట్ కిడ్జ్ పాల కార్యక్రమం లో మేయర్

 

 

టీ మీడియా,ఆగస్టు27, ఖమ్మం సిటీ:
పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలని తగిన జాగ్రత్తలను పాటించి పర్యావరణాన్ని కాపాడాలని ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. నగరంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల యాజమాన్యం, ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జ్యూట్ బ్యాగులను పాఠశాల పేరిట తయారు చేయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మేయర్ పునుకొల్లు నీరజ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, 55,56 డివిజన్ కార్పొరేటర్లు మోతారపు శ్రావణి సుధాకర్ మరియు పైడిపల్లి సత్యనారాయణ రోహిణి లతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులకు జ్యూట్ బ్యాగులను అందజేశారు.

ఈ సందర్భంగా మేయర్ పునుకొల్లు నీరజ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ స్మార్ట్ కిడ్జ్ పాఠశాల యాజమాన్యం మంచి ఆలోచనతో “పర్యావరణ పరిరక్షణ” కోసం ప్లాస్టిక్ కవర్లను నిషేధించి జ్యూట్ బ్యాగులను విద్యార్థులకు తల్లిదండ్రులకు అందజేయడం శుభపరిణామం అని, ఇదే ఆలోచనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని,ప్లాస్టిక్ కవర్లు వాడటం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని, ప్లాస్టిక్ భూమిలో కరగకపోవటం వల్ల మృత్తికలో లోపాలు ఏర్పడుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో భూమిలో మంచి పంటలు పడటానికి అవకాశాలు లేవని, ప్లాస్టిక్ వాడకం వల్ల భూమి మీద వ్యర్ధాలు పెరిగిపోతున్నాయని తద్వారా మట్టి కాలుష్యం నీటి కాలుష్యం,వివిధ రూపాల్లో ప్రభావం చూపుతున్నాయని,
విద్యార్థులు పర్యావరణంపై అవగాహన కలిగి ఉండి దాన్ని కాపాడాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు.

 

 

పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని, దీనిలో భాగంగానే తమ పాఠశాల తరఫునుండి “జూట్” బ్యాగులను తయారు చేయించి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందజేయడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా 55వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ *పైడిపల్లి సత్యనారాయణ రోహిణి మరియు పాఠశాల డైరెక్టర్ చింత నిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube