ప్రకృతితో సహజీవనమే పర్యావరణ పరిరక్షణ

ప్రకృతితో సహజీవనమే పర్యావరణ పరిరక్షణ

0
TMedia (Telugu News) :

ప్రకృతితో సహజీవనమే పర్యావరణ పరిరక్షణ

– పర్యావరణ పరిరక్షణ గురించి గ్రామాలలో,పట్టణాలలో విస్తృత ప్రచారం చేయాలి.

-అడ్వకేట్ మోతే రాజలింగు

టీ మీడియా, జూన్ 05,రామకృష్ణాపూర్:
రామకృష్ణాపూర్ లో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆదివారం రైట్ టు హెల్త్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ మోతే రాజలింగు సభ్యులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం సకల జీవరాశులు, మానవ మనుగడ సాగించడానికి,భావి తరాల భవిష్యత్తుకు, ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలన్నారు. మొక్కలు పెంచడానికి ఎవరికీ మినహాయింపు లేదన్నారు. హరిత భవిష్యత్ పరిరక్షణకు విద్యార్థులు,యువత, రైతులు, స్వచ్ఛంద సంస్థలు,ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి, ప్రతి గ్రామంలో చెట్లు నాటాలన్నారు. కాలుష్యం, భూతాపం తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. రోడ్ల వెంబడి, పొలం గట్ల మీద, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం గురించి గ్రామాల్లో పట్టణాల్లో ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు లింగంపెల్లి అక్షర్, గడ్డం భూమేష్, లింగంపెల్లి అభిలాష్, చారి తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube