బ్యాంకు కు టోకరా

పోలాలే లేని వాటికి పాసు పుస్తకాలు

1
TMedia (Telugu News) :

బ్యాంకు కు టోకరా
-పోలాలే లేని వాటికి పాసు పుస్తకాలు

పాసు పుస్తకాలు తనఖా పెట్టి కోటి రూపాయలు రుణాలు
టీ మీడియా,జులై 28వినుకొండ:- శావల్యాపురం మండల కేంద్రంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు లో 2017-2018 ఆర్థిక సంవత్సరంలో వినుకొండ, శావల్యాపురం మండలం పిచికలపాలేం, కారుమంచి కి చెందిన పది మంది పట్టాదారు పాసుపుస్తకాల పై సూమారు కోటి రూపాయల రుణం పొందినట్లు సమాచారం,మూడు సంవత్సరాలైనా పదిమంది లో ఒక్కరైనా ఒక్క రూపాయి కూడా బ్యాంకు లో జయ చేయకపోవడంతో రుణాలు వసూలు కోసం బ్యాంకు సిబ్బంది ఆ యా గ్రామాల్లో విచారణ చేపట్టగా రుణాలు పొందిన వారి పేర్ల తో అసలు పోలాలు లేనట్లు తెలుసుకున్నారు.

 

Also Read : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ఇంచార్జ్ డీసీపీ

 

అసలు పోలాలే లేని వాటికి పాసుపుస్తకాలు ఏలా వచ్చాయి,అవి ఏవరు మంజూరు చేశారు,అవి తీసుకుని వచ్చి బ్యాంకు లో తనఖా పెట్టి కోటి రూపాయలు రుణాలు పై బ్యాంకు సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ సంఘటన పై పోలిస్ వారికి ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. రుణాలు మంజూరు చేసే సమయంలో బ్యాంకు అధికారులు విచారణ చేపట్టారా లేదా చేపటితే అప్పుడు అన్ లైన్లో ఉన్న వివరాలు ఇప్పుడు ఎందుకు లేవు…??? ఈ సంఘటన లో రెవెన్యూ అధికారులు, బ్యాంకు సిబ్బంది సహకారం ఉన్నదా లేదా అనేది ఫిర్యాదు అనంతరం పోలిస్ అధికారుల విచారణ అనంతరం వెలుగులోకి వస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube