42 ప్యాసింజర్ రైళ్లు రద్దు -కరెంట్ కోతల నేపథ్యంలో కీలక నిర్ణయం
టీ మీడియా, ఏప్రిల్ 30,న్యూఢిల్లీ : దేశంలో.కరెంట్ కోతల మరింత ముదరకముందే చర్యలకు ఉపక్రమించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని థర్మల్ ప్లాంట్ల వద్ద బొగ్గునిల్వలు అడుగంటిన నేపథ్యంలో బొగ్గు రైళ్లు సాఫీగా, వేగంగా ప్రయాణించేందుకు వీలుగా 42 రైళ్లు ను రద్దు చేసింది.దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 70 శాతం బొగ్గు ఆధారితమే. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్లాంట్లకు సకాలంలో బొగ్గు చేరడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ క్రిష్ణ బన్సల్ వెల్లడించారు. నిరవధికంగా పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు వివరించారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.
Also Read : హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సూసైడ్
యుద్ధ ప్రాతిపదికన బొగ్గు రవాణా చేస్తున్నట్టు చెప్పారు. అయితే రైళ్ల రద్దు తాత్కాలికమే. పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చాక తిరిగి ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు. కాగా ఇదే కారణంతో ఇదివరకే 3 రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) రోజువారీ బొగ్గు నిల్వ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో 165 థర్మల్ పవర్ ప్లాంట్లలో 65 ప్లాంట్ల వద్ద కేవలం 10 శాతం కంటే తక్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయి. 26 ప్లాంట్ల వద్ద 5 శాతం కంటే తక్కువ బొగ్గు ఉందని రిపోర్ట్ స్పష్టం చేసింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube