పట్టణప్రగతి పనులు పూర్తి చేయాలి
-కలెక్టర్ విపి గౌతం విస్తృత పర్యటన
టి మీడియా,జూన్ 18,మధిర:
పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు.కలెక్టర్ శుక్రవారం మధిర పట్టణంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పట్టణంలో తెలంగాణ క్రీడా ప్రాంగాల ఏర్పాటు, స్థలపరిశీలనలు చేసారు. స్థానిక యువతకు నైపుణ్యం ఉన్న క్రీడ పరికరాలు, కోర్టులను నిర్మించాలన్నారు. ప్రభుత్వ భూములు అణ్యాక్రాంతం కాకుండాపటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మొక్కలు నాటాలన్నారు.బ్రిడ్జి క్రింద ఖాళీస్థలంలో ఏర్పాటు చేసిన పిల్లల పార్కులో ఆటవిడుపు పరికరాలను ప్రారంభించారు.
Also Read : హైదరాబాద్ నుండి ఖమ్మం బయల్దేరి వస్తున్న తెరాస ఎంపీల బృందం
బస్ షెల్టర్, వెయిటింగ్ హాల్, పార్కింగ్ ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. మధిర పట్టణంలో డ్రైనేజ్లను పరిశీలించి మురుగు నిల్వ ఉండటం గమనించిన కలెక్టర్ వెంటనే శుభ్రం చేయాలని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమలు వ్యాప్తి చెందుతాయని, సీజనల్ వ్యాధులు ప్రభలుతాయని ప్రతిరోజు పారిశుధ్య పనులను చేయించాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఏ.సి.పి. ఎస్. సంకీర్త్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఏ.ఎల్.ఎన్.శాస్త్రి, జిల్లా పంచాయతీ అధికారి హరి ప్రసాద్, ఆర్.అండ్. బి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్, టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి ఇ.ఇ టి. ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, కమీషనర్ రమాదేవి, పబ్లిక్ హెల్త్ ఇ.ఇ రంజిత్ కుమార్, తహశీల్దారు రాజేష్, ఎం.పి.పి లలిత, మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్‌రెడ్డి, ఎం.ఈ.ఓ ప్రభాకర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube