పట్టణ ప్రగతి ప్రజలకు శూన్యం
టీ మీడియా, జూన్ 21, వనపర్తి బ్యూరో : ఘటన ప్రగతి లో అభివృద్ధి కనిపించడం లేదని ఐక్యవేదిక అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ అన్నారు. నాలుగవ దశ పట్టణ ప్రగతి కార్యక్రమం ఈ నెల 3వ తేదీ నుండి 18వ తేది వరకు జరిగింది. దీనికంటే ముందుగా రాష్ట్రంలో 12769 గ్రామపంచాయతీలలో ఐదు దశల పల్లె ప్రగతి.అలాగే,142 నగరాలు, పట్టణాలలో నాలుగో దశ పట్టణ ప్రగతి జరుగుతున్నది.ఇప్పటివరకు తెలంగాణలోని పట్టణాలకు నగరాలకు 3318 కొట్లు విడుదలయ్యాయని వాటిలో రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు నిధులు ఖర్చు చేశారని ప్రభుత్వం పేర్కొన్నది. కానీ జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో ఎన్ని నిధులు వచ్చాయి, దీనికి ఖర్చు పెట్టారు ఇంతవరకూ తెలియదనీ, ఎందుకంటే ప్రతిసారీ పట్టణ ప్రగతిలో కంప చెట్టు తీయడం మురికి కాలువలు తీసి ఫోటోలు పెట్టడమే జరుగుతుంది. వనపర్తి లోని 33 వార్డులలో దాదాపు 20 నుండి 25 వార్డులో ఇంత వరకు ఎలాంటి అభివృద్ధి పనులు సరిగా జరగలేదు.
Also Read : ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య
ముఖ్యంగా విలీన గ్రామాల్లో అస్సలు పనులు జరగలేదు. పట్టణ ప్రగతి పేరుతో వస్తున్న పైసలు అన్నీ కూడా ఇతర పథకాలకు దారి మళ్లించారు అభియోగం ఉంది. ఈ మూడు సంవత్సరాల్లో వార్డులలో రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మాణం కాలేదు. మిషన్ భగీరథ పేరుతో రోడ్లను తవ్వి ఇంత వరకు రోడ్డు నిర్మాణం చేయలేదు, కొన్ని వార్డులలో తాగునీటి సౌకర్యం కూడా లేదు. కౌన్సిలర్లు కంప చెట్లు తీయడం, మురికి కాలువలు తీయడo, ఆడవాళ్ళతో ఫోటోలు దిగడం తప్ప ఎలాంటి అభివృద్ధి చూపలేదు. వనపర్తి లో ప్రభుత్వపరంగా మంత్రి గారు చేసిన అభివృద్ధి పనులు తప్ప మున్సిపాలిటీ నుండి ఎలాంటి అభివృద్ధి పనులు కనబడటం లేదనీ అఖిలపక్ష ఐక్యవేదిక విమర్శించింది.
కనుక వనపర్తికి వాళ్లకు సంబంధించిన వీధులలో, విలీన గ్రామాల అయిన వార్డులలో తోలు సౌకర్యాలు మురికి కాలువలు నిర్మించాలని, పాలకులు తదితర సౌకర్యాలను కూడా కల్పించాలని, అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది.
Also Read : పాఠశాలకు ఫ్యాన్ వితరణ
అలాగే వనపర్తి శివార్లలో చేస్తున్న లేఅవుట్లు తీసుకునే పర్మిషన్ కంటే ఎక్కువ స్థలాన్ని లేఅవుట్లు గా చేస్తున్నారు. ప్రభుత్వ భూములను దేవాదాయ భూములను ఆక్రమిస్తూ అక్రమాలకు పాల్పడుతుంటే సంబంధిత టి పి వో లు వారితో కుమ్మక్కై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు. ముసలా అధికార వ్యవస్థలో కుప్పకూలిపోయింది. కనుక మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష వీటిని దృష్టిలో పెట్టుకుని సరి చేయాల్సిందిగా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, చిరంజీవి, వెంకటేష్, భాస్కర్, రమేష్,రాజనగరం రాజేష్, పేర్కొన్నారు