పట్టణ ప్రగతి తో అభివృద్ధి సాధ్యం
-వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్.
టి మీడియా,జూన్ 11, లక్షెట్టిపేట:
పట్టణ ప్రగతి తో అభివృద్ధి సాధ్యమని మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వీకర్ సెక్షన్ లో 4 వ విడత పట్టణ ప్రగతి లో భాగంగా పలు పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. మురికి కాలువలను శుభ్రం చేయించారు. కాలనీలో పలు చోట్ల మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం వార్డు లో ఉన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఏర్పాటు చేసిన నర్సరీ ని సందర్శించి మొక్కల సంరక్షణ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డులో ప్రజలు ఫిర్యాదు చేసిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపాలిటి అధికారులను చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ లు ఆదేశించారు. అంతేకాకుండా వార్డులో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వైస్ చైర్మన్ పొడిటి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మౌళిక సదుపాయాల విషయం లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, స్థానిక వార్డ్ కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ఆకుల వెంకటేష్, టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు గడ్డం వికాస్, మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య, మాజీ సర్పంచ్ మినుముల సుమతి శాంతి కుమార్, మాజీ వార్డు సభ్యులు గరిసె రవీందర్, ముతే తిరుపతి, జాగృతి కన్వీనర్ బాణాల రమేష్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బాకం లచ్చన్న, అంకతి కిషన్, 5 వార్డు అధ్యక్షులు కూకట్ల తిరుపతి , 5వార్డు మహిళా అధ్యక్షురాలు కాసిరపు వనజ, సెక్రటరీ మామిడి రాజేశ్వరి, కాలనీ సభ్యులు అలీమ్, నరసయ్య, దుర్గయ్య, నారాయణ, మురళి, రాపెళ్లి కృష్ణ, తగరపు సత్తయ్య, అశోక్, పిట్టల రాకేష్, మున్సిపల్ సిబ్బంది మేనేజర్ శ్రీహరి , అసిస్టెంట్ ఏఈ పాదం ప్రమోద్, కట్ల రాకేష్, వేణు, దినేష్, శేఖర్, చరణ్, రవి,డ్వాక్రా గ్రూప్ మహిళలు లలిత తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube