స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్

స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్

1
TMedia (Telugu News) :

స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్

టీ మీడియా, మార్చి 15, ధర్మపురి :జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక, శ్రీ లక్ష్మీ నృసింహు స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున, జిల్లా కలెక్టర్ గుగులోతు రవి దంపతులు ఉదయం వేళ, సంప్రదాయ దుస్తులు ధరించి, స్వామి వారికి, కల్యాణ మహోత్సవంలో భాగంగా, పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. తదనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు, కలెక్టర్ గుగులోతు రవి దంపతులకు, స్వాగతం పలికి, ప్రధాన అలయంతో పాటు, అనుబంధ ఆలయాలలో, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కలెక్టర్ దంపతులకు, ఆశీర్వచన మండపంలో, వేద పండితులు, అర్చకులు, స్వామివారి చిత్ర పటంతో పాటు, తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా, ఆశీర్వదించడం జరిగింది.

also read:తిరుమల లోనామ జన్మదిన వేడుకలు

తదనంతరం ఆలయ అధికారులు, దాతల సహాయంతో, పుణ్యక్షేత్రం పరిధిలో, బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు, స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో, అన్నదాన కార్యక్రమంలో పాలుగోని, అన్నదాన కార్యక్రమన్ని జిల్లా కలెక్టర్ గుగులోతు రవి ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్, ఆలయ వేద పండితులు, అర్చకులు, భోజ రమేష్ శర్మ, నంబి శ్రీనివాస చార్యులతో పాటు, స్థానిక మునిసిపల్ ఛైర్మన్ సంగి సత్తమ్మ, ఎంపీపీ ఎడ్ల చిట్టి బాబు, ఆలయ ఛైర్మన్ ఇందారపు రామన్న, కమిటీ సభ్యులు చుక్క రవి, సంగెం సురేష్, స్తంభంకాడి మహేష్ డీజే, గుంపుల రమేష్, తదితరులు పాలుగోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube