‘ఇక యుద్దమే.. రండి గూండాల్లారా’.. పవన్ కళ్యాణ్ ఫైర్..

‘ఇక యుద్దమే.. రండి గూండాల్లారా’.. పవన్ కళ్యాణ్ ఫైర్..

1
TMedia (Telugu News) :

‘ఇక యుద్దమే.. రండి గూండాల్లారా’.. పవన్ కళ్యాణ్ ఫైర్..

 

టీ మీడియా, అక్టోబర్ 18, అమరావతి : వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ‘ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసుల్లారా పిసికి చంపేస్తా.. చెప్పుతో కొడతా నా కొడకల్లారా. విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నా.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగే మీరా నాకు చెప్పేది’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలతో వైసీపీపై మండిపడ్డారు. వైసీపీ చేసేది అవకాశవాద రాజకీయమని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఈరోజు నుంచి యుద్దమేనని అన్నారు. ఎంతమంది వైసీపీ గుండాలు వస్తారో రండి. ‘రాళ్లా..? కర్రలా..? హకీ స్టిక్కులా..? రండిరా కొడకల్లారా’ చూసుకుందాంటూ పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. గత 8 సంవత్సరాల కాలంలో తాను 6 సినిమాలు చేశానని.. దాదాపు 100 నుంచి 120 కోట్లు సంపాదించానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పిల్లల ఎఫ్‌డీ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించానని.. సీఎం ఫండ్‌, ఇతర సేవా కార్యక్రమాలకు రూ. 12 కోట్లు ఇచ్చానని.. అయోధ్య రామాలయానికి రూ. 33 లక్షలు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Also Read : భారత్‌లో త్వరలో ఏకే-203 రైఫిల్స్‌ తయారీ షురూ

‘నేను వాహనం కొంటే.. అది గిఫ్ట్ ఇచ్చారని అంటారా.. దానికి జీఎస్టీ కూడా కట్టాను. ఎదవల్లారా నా సంపాదన ఎంతో మీకు తెలుసా’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారని.. ఇకపై మరో రూపం చూస్తారని జనసేనాని ధ్వజమెత్తారు. తనకు రాజకీయం తెలియదన్న వైసీపీకి రాజకీయం ఏంటో చూపిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బూతుల పంచాంగం చెప్పే ప్రతీ వైసీపీ నేతకు ఇదే నా వార్నింగ్’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వైసీపీ నేతలంతా చెడ్డవాళ్లు కాదని.. బాలినేని లాంటి మంచివారూ ఆ పార్టీలో ఉన్నారని.. ఆయనకు థ్యాంక్స్ అని పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతీ ఒక్కరికి భావస్వేచ్చ ప్రకటన ఉందని.. మాట్లాడొచ్చునని డీజీపీ అన్నారన్న పవన్ కళ్యాణ్.. భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్చతోనే తాను మాట్లాడుతున్నానని అన్నారు. అలాగే తెలంగాణలో జనసేన పోటీపై క్లారిటీ ఇచ్చారు పవన్‌ కల్యాణ్. ఏపీ అభివృద్ధి తెలంగాణకు చాలా అవసరమన్న పవన్‌… అక్కడ ఏడు నుంచి 14 అసెంబ్లీ స్థానాల్లో… రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube