బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బకాయిలు చెల్లించండి

ఏఐబి (ఎస్ )ఎన్ నెట్వర్క్ హెల్ప్ లైన్ వినతి

0
TMedia (Telugu News) :

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బకాయిలు చెల్లించండి

– ఏఐబి (ఎస్ )ఎన్ నెట్వర్క్ హెల్ప్ లైన్ వినతి

టీ మీడియా, డిసెంబర్ 28, హైదరాబాద్ : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు చెందిన బకాయిలు వెంటనే చెల్లించి, లబ్దిదారులు, దరఖాస్తుదారులను, పరిషత్ ఉద్యోగులను ఆదుకోవాలని అఖిల భారత బ్రాహ్మణ ( సర్వీస్ )నెట్ వర్క్ హెల్ప్ లైన్ ద్వారా, ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి మల్లు బట్టి విక్రమార్కను కోరారు. లేఖ ఇలా….

శ్రీయూత గౌరవనీయులైన మల్లు బట్టీ విక్రమార్క ( తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి )గారికి

విషయం : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ లబ్దిదారులు, ఉద్యోగుల గురించి

పేద బ్రాహ్మణుల కోసం గత ప్రభుత్వం తెలంగాణ బ్రహ్మణ సంక్షేమ పరిషత్ (సొసైటీ ) ఏర్పాటు చేసింది. వివిధ పథకాలు ద్వారా ఎంపిక అయిన లబ్ది దారులు ఖాతా లో డబ్బులు వేసే వారు. పరిషత్ కు అవసరమైన సిబ్బంది ఇవ్వక పోవడం తదితర కారణాలు తో విచారణలు ఆలస్యం అయి 2021, 2022 లో దరఖాస్తులు చేసుకున్న వారి ఎంపీకలు 2023 లో ఎన్నికల నోటిఫికేషన్ ముందు పూర్తి చేసారు. ఎన్నికల కోడ్ మూలంగా పరిషత్ లోని బెస్ట్ స్కీమ్ లో ఎంపిక అయిన బ్రాహ్మణ లబ్ధిదారులకు, విదేశాల్లో చదువుతూ వివేకానంద ఓవర్సీస్ పథకం క్రింద ఎంపిక అయిన వారిని అర్హులుగా గుర్తించి కూడా నేటికీ ఖాతాల్లో డబ్బులు వేయలేదు.

Also Read : రాష్ట్రంలో వైసిపి విశ్వసనీయతకు మారుపేరుగా నిలవాలి

మరికొందరికి ఇంటర్వులు పూర్తి అయినా క్షేత్ర స్థాయి విచారణలు ఆగిపోయాయి. ఇంకొందరు ధరఖాస్తుదారులకు అసలు ఇంటర్యూలు కూడా జరగలేదు. మూడు రకాల క్యాటగిరి ల సమస్యలలో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ దరఖాస్తు దారులు ఉన్నారు. అదే విధంగా పరిషత్ లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలు గా వేతనాలు లేవు. జనవరి 1కి నాల్గవ నెల వస్తుంది. పెద్ద మనసుతో బ్రహ్మనత్వం కలిగిన తమరు పరిశీలించి చర్యలు తీసుకోగలరు. అదే విధంగా ఇప్పుడు ఉన్న సోసైటీ ని రాష్ట్ర బ్రాహ్మణ సోసైటీ గా ( తెలంగాణ రాష్ట్ర కొ ఆపరేటివ్ బ్యాంక్ ) లాగా మార్చి, జిల్లాస్థాయి లో బ్రాహ్మణ సహకార ప్రాధమిక సొసైటీ లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.

ఇట్లు
అఖిల భారత బ్రాహ్మణ (సర్వీస్ ) నెట్ వర్క్, హెల్ప్ లైన్

కన్వీనర్ : శనగపాటి మురళి కృష్ణ
8919710365

కో -కన్వీనర్ లు :

1. రావుల పాటి శ్రీనివాసరావు

2. శివరాజు శ్రీ రమ

3. తెరాల శ్రీనివాస శర్మ

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube