వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకటించాలి

వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకటించాలి

1
TMedia (Telugu News) :

వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకటించాలి

టీ మీడియా, జూలై 27, వనపర్తి బ్యూరో : వీఆర్ఏలు వనపర్తి తాసిల్దార్ కార్యాలయం ముందు రెండవ రోజు సమ్మె కొనసాగించారు .జూలై 25 నుంచి నిరవధిక సమ్మె జరుగుతున్నది. ఈ సమ్మెకు సిఐటియు వనపర్తి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏం.రాజులు ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లుగా పే స్కేల్ తరహా వేతనాలు ఇవ్వాలని, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, విద్యార్హతను బట్టి ప్రమోషన్ ఇవ్వాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్యల పరిష్కారం కోసం రెండు సంవత్సరాలుగా దశల వారి పోరాటాలు నిర్వహించడం జరిగింది. జులై 20, 21, 22 తేదీలలో రిలే నిరాహార దీక్షలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగింది.

 

Also Read : ప్రజల నుండి ఫిర్యాదులు అందితే చర్యలకు సిద్ధం

జూలై 23న కలెక్టరేట్ ముట్టడి విజయవంతంగా జరిగింది. జులై 25 నుంచి ఈ నిరవధిక సమ్మె రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నది. ఈ సమ్మెకు అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు ఇచ్చి ఈ సమస్యల పరిష్కారం అయ్యేవరకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేసి సమ్మెను విరమింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, ఆర్.ఎన్ రమేషు వీఆర్ఏల సంఘం వనపర్తి మండల నాయకులు రమేష్ , మహేష్, భాగ్యలక్ష్మి, కృష్ణవేణి, లక్ష్మీ, రాధా తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube