త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్

త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్

1
TMedia (Telugu News) :

త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
టీ మీడియా, జూన్ 3 ,ఖమ్మం :త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు.పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు, కేసుల నమోదు, రికార్డులు పరిశీలించారుపోలీస్ స్టేషన్ లో రిసెప్షన్ స్టాప్, స్టేషన్ రైటర్స్, క్రైమ్ రైటర్స్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ కార్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ , టెక్నికల్ టీమ్, క్రైమ్ స్టాప్ తదితర విభాగాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికివిధుల నిర్వహణలో రోల్ క్లారిటీ వుండాలని అన్నారు.

Also Read : ఈవివి గుండె పోటుతో మృతి

ప్రజల భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు దోహదపడే సీసీ కెమెరాల ఏర్పాట్లపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.రక్షణ కోసం ప్రధాన సంపత్తిగా మారిన సీసీ కెమెరాలతో ఒక పక్క నేరాలను అదుపు చేయడం.. మరో పక్క నేరాలు జరగకుండా అడ్డుకోవడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్న నేపథ్యంలో నేనుసైతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలతో నిఘా నీడల్లోకి తీసుకొనిరావాలని సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube