వృద్ధాశ్రమం నిర్వహకురాలిపై పీడీయాక్ట్

వృద్ధాశ్రమం నిర్వహకురాలిపై పీడీయాక్ట్

1
TMedia (Telugu News) :

వృద్ధాశ్రమం నిర్వహకురాలిపై పీడీయాక్ట్
టీ మీడియా, జూలై 1, వరంగల్:వృద్ధాశ్రమం నిర్వహకురాలి ముసుగులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న వృద్ధాశ్రమ నిర్వహకురాలిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి.*వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని కాజీపేట, హన్మకొండ, కేయూసి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాని నిరుద్యోగుల వద్ద లక్షల్లో డబ్బు వసూళ్ళకు పాల్పడుతున్న అమ్మ వృద్రమం నిర్వహకురాలు, ప్రశాంత్ నగర్, కాజీపేట్ చెందిన రాచమల్ల శ్రీదేవిపై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను కాజీపేట ఇన్స్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి నిందితురాలికి ఖమ్మం కారాగారంలో అందజేసి నిందితురాలిని చంచల్ గూడ కారాగారానికి తరలించారు.పీడీ యాక్ట్ అందుకున్న నిందితురాలు తన భర్తకు విడాకులు ఇచ్చి ఇటీవల ఉద్యోగాలు ఇప్పిస్తాని లక్షలు వసూళ్ళకు చివరకు పోలీసులకు చిక్కి పీడీ యాక్ట్ తో చర్లపల్లిలో వున్న బానోత్ రాజ్ కుమార్ తో కల్సి వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి.

 

Also Read : కేసీఆర్ బాధ్యత మరిచి పని చేస్తున్నారు

ఈ వృద్ధాశ్రమం నిర్వహణ ముసుగులో ఈ కిలాడీ లేడీ మరో నిందితుడు రాజ్ కుమార్ తో కలిసి మరింత సులభంగా డబ్బు సంపాదించేందుకుగాను తనకు ఉన్నత వ్యక్తులతో పరిచయం వున్నదని తెలియజేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిందితురాలు ప్రచారం కల్పించుకోడంతో పాటు, నమ్మిన బాధితుల నుండి నిందితురాలు లక్షల్లో వరకు డబ్బులు వసూళ్ళు చేయడంతో నిందితురాలిపై పీడీయాక్ట్ ఉత్తర్వులు జారీచేయడం జరిగిందని పోలీస్ తెలిపారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడూతూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తం వుండాలని, ప్రభుత్వ ఉద్యోగాలు అభ్యర్థులు పరీక్షల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఉ ద్యోగాలు వస్తాయని అభ్యర్థులు గమనించాలని, ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూళ్ళకు పాల్పడితే వారిపై పీడీయాక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube