గంజాయి స్మగ్లర్లపై పీడీయాక్ట్

గంజాయి స్మగ్లర్లపై పీడీయాక్ట్

1
TMedia (Telugu News) :

గంజాయి స్మగ్లర్లపై పీడీయాక్ట్

 

టి మీడియా, అక్టోబర్ 2,వరంగల్ : కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేసినారు.ఒడిషా రాష్ట్రం నుండి హైదరాబాద్ కు స్మగ్లింగుకు పాల్పడుతున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన ముద్దు కృష్ణ, సిరిగిరి బాలరాజులకు పీడీ యాక్ట్ ఉత్తర్వులను రఘునాథ్ పల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సంతోష్ చర్లపల్లి కారాగారంలో నిందితులకు జైలర్ సమక్షంలో అందజేసారు.

Also Read : టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

నిందితులు మరో కొద్ది మంది నిందితులతో కల్సి గత ఫిబ్రవరి 2వ తేదిన ఆంధ్ర-సీలేరు సరిహద్దులోని సీలేరు ప్రాంతం నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ మీదుగా వ్యాలో సేంద్రియ ఎరువుల సంచుల క్రింద రహస్యంగా భద్రపర్చిన 2కోట్ల 36 లక్షల రూపాయల విలువగల 1577 కిలోల గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తుండుగా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల బైపాస్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కారు. దేశ అభివృద్ధిలో కీలకంగా నిలిచే యువతను భవిష్యత్తు అందకారంలోకి పడవేసి, వారి జీవితాలను తీవ్ర ప్రభావితం చేస్తున్న మత్తు పదార్థాల అక్రమ రవాణా పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో వారిపై పీడీ యాక్ట్ క్రింద కేసులను నమోదు చేయడం జరుగుతుందన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube