పోలవరం నిర్వాసితుల దీక్షను విరమింపజేసిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ
పోలవరం నిర్వాసితుల దీక్షను విరమింపజేసిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ
పోలవరం నిర్వాసితుల దీక్షను విరమింపజేసిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ
టీ.మీడియా, డిసెంబర్ 5, చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ వీఆర్పురం మండలం కు సంబంధించిన రామవరం రామవరం పాడు పోలవరం నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు సోమవారానికి 12 రోజులకు చేరాయి. దీక్షా శిబిరాన్ని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు సందర్శించి 104 నిర్వాసిత కుటుంబాల గురించి స్థానిక ఐటిడిఏపీఓ ఫార్మర్ అహ్మద్ ఖాన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రామవరం రామవరం పాడు నిర్వాసిత గ్రామాల్లో భూ సర్వే నెంబర్లు 78. 102 సంబంధించి సర్వే నిర్వహించలేదని పోలవరం పరిహారం ప్యాకేజీ ప్రకటన కూడా పత్రికల్లో రాలేదన్నారు. వరదల్లో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ కల్పించాలని. భూమికి భూమి ఇంటికి ఇల్లు నిరుద్యోగ భృతి తో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలన్నారు. 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందజేయాలన్నారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ ఫర్ మాన్ అహ్మద్ మాట్లాడుతూ ఆయా గ్రామాలను తాను సందర్శించడం జరిగిందని పోలవరం సర్వే తప్పులు తడకగా ఉందని 14 కుటుంబాల గురించి పై అధికారులతో చర్చించి పంపించిన కాపీ లిస్టులను ఎమ్మెల్సీ ఐ వి గారికి ఇవ్వడం జరిగింది రాణి భూ సర్వే నంబర్లు 78. 102లుగా వివరించారు. తప్పకుండా నిర్వాసితులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ మీకు జరుగుతున్న అన్యాయం గురించి సబ్ కలెక్టర్ మరియు ప్రత్యేక పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ అధికారి.
Also Read : ఓటు వేసి కాలినడకన అన్నయ్య ఇంటికి ప్రధాని
కమిషనర్ గార్లతో మాట్లాడటం జరిగిందని శాసనమండలిలో ఈ విషయం మాట్లాడతానని హామీ ఇచ్చారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్ష పరులను విరమింప చేసినారు. ఈ కార్యక్రమంలో రామవరం రామవరప్పాడు గ్రామ నిర్వాసితులు వి ఆర్ పురం చింతూరు సిపిఎం మండల కార్యదర్శి లు సేసం సురేష్. సోయం చినబాబు. సిఐటియు జిల్లా కార్యదర్శి పల్లపు వెంకట్. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పండ కృష్ణయ్య. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూణెం సత్యనారాయణ. విఆర్ పురం ఎంపీపీ కారం లక్ష్మి రామవరం సర్పంచ్ కారం బుచ్చమ్మ. ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube