పీడీఎస్ బియ్యం పట్టివేత

వాహనం సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు

1
TMedia (Telugu News) :

పీడీఎస్ బియ్యం పట్టివేత

– వాహనం సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు

టీ మీడియా,నవంబర్ 17,కొమరంభీం ఆసిఫాబాద్ :  నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. అక్రమంగా బొలేరో వాహనంలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్, ఐపీఎస్, అడీషనల్ ఎస్పీ అచ్చేశ్వరరావు (అడ్మిన్)ల ఆదేశాల మేరకు మరియు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామం వద్ద పోలీసులు తణిఖీలు చేపట్టారు. బెజ్జూర్ నుండి మహారాష్ట్ర కు బొలెరో వాహనంలో‌ ( టీఎస్ 20, టీ 4699) పీడీఎస్ బియ్యం తరలిస్తుండగా డబ్బా గ్రామం వద్ద పట్టుకుని ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న నిందితుడు బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామానికి చెందిన
A1:-వొజ్జల రాజన్న, (తండ్రి: గుండయ్య)గా
పోలీసులు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని పట్టుబడ్డ 28 క్వింటాళ్ల బియ్యంతో పాటు బొలేరో వాహనాన్ని చింతలమానెపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube