పాత‌బస్తీలో ప్ర‌శాంతంగా ముగిసిన ప్రార్థ‌న‌లు

పాత‌బస్తీలో ప్ర‌శాంతంగా ముగిసిన ప్రార్థ‌న‌లు

1
TMedia (Telugu News) :

పాత‌బస్తీలో ప్ర‌శాంతంగా ముగిసిన ప్రార్థ‌న‌లు

టీ మీడియా, ఆగస్ట్ 26, హైద‌రాబాద్ : అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ పాత‌బ‌స్తీలో శుక్ర‌వారం ప్రార్థ‌న‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. మ‌క్కామ‌సీదు వ‌ద్ద వేల మంది ప్రార్థ‌న‌లు పాల్గొన్నారు. ప్రార్థ‌న‌లు ముగిసిన అనంత‌రం చార్మినార్ వ‌ద్ద‌ గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్య‌తిరేకంగా ముస్లిం యువ‌కులు నినాదాలు చేశారు. ఇక ఆందోళ‌న‌కు య‌త్నించిన అల్ల‌రిమూక‌ల‌ను ర్యాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్‌, టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెద‌ర‌గొట్టారు. సౌత్ జోన్ డీసీపీతో పాటు పోలీసు ఉన్న‌తాధికారులు చార్మినార్ వ‌ద్ద భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.

 

Also Read : ఘనంగా బోనాల పండుగ

ఆందోళ‌న‌కారుల‌ను గుర్తించేందుకు పోలీసులు ఆయా ప్రాంతాల్లో సివిల్ డ్రెస్సుల్లో మోహ‌రించారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై రాజాసింగ్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో ముస్లింలు ఆందోళ‌న‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓల్డ్ సిటీలో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. పాత‌బ‌స్తీకి వెళ్లే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఎలాంటి ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube