పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడి

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడి

0
TMedia (Telugu News) :

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడి

టి మీడియా, జనవరి 19, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం పోలీస్ నియామకాలలో అవక తవకల పై పోలీస్ అభ్యర్థులకు మద్దతుగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివ సేన రెడ్డి ఆదేశానుసారం,గురువారం యువజన కాంగ్రెస్ పూదరి చంద్రశేఖర్ అధ్యర్యంలో కలెక్టరేట్ ముట్టడి.పోలీస్ నియమకాలలో హై కోర్ట్ తీర్పు ప్రకారం మల్టిపుల్ ప్రశ్నలకు 7 మార్కలు కలపి మెయిన్స్ కి అనుమతించాలి.రన్నింగ్ అర్హత పొంది లాంగ్ జంప్ లో అనార్హులైనా వారిని కూడా మెయిన్స్ కి అనుమతించాలి.పోలీస్ విభాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తప్పుడు నియామకాల వల్ల ఎంతో మంది అభ్యర్థుల జీవితాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది.

Also Read : ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

ఈ తప్పుడు నియామకాల వల్ల అభ్యర్థులలో కొందరు ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది కావున వారి కుటుంబాన్నికి ప్రభత్వం వెంటనే కోటి రూపాయల ఎక్సగ్రెసియా ప్రకటించాలి.ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బడరీ సునిల్ గౌడ్,పట్టణ అధ్యక్షుడు భూసనవేని సురేష్ గౌడ్,ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కొమ్ము అభిలాష,మోతె రాహుల్,సరికొమ్ము మణికాంత్,సోంపి విజయ్ కుమార్,పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube