పెద్దబాలశిక్ష పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది

పెద్దబాలశిక్ష పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది

2
TMedia (Telugu News) :

పెద్దబాలశిక్ష పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది

టీ మీడియా , జూన్ 16 ,దుమ్ముగూడెం:బెక్కంటి శ్రీనివాస్ ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో బడిబాటలో భాగంగా బుధవారంనాడు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల బండారిగూడెంలో పెద్ద బాల శిక్ష పుస్తకాల పంపిణీ చేస్తూ పెద్దబాలశిక్ష పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది పడుతుందని గ్రామ సర్పంచ్ కాటిబోయిన చిన్న వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్తగా చేరిన పిల్లల తల్లిదండ్రులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ,ఈ సంవత్సరం మన పాఠశాలల్లో తెలుగు మీడియంతోపాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెడుతున్నామని అవకాశాన్ని అందరూ సద్వినియోగపర్చుకోవాలని బెక్కంటి కోరారు.

Also Read ; పోలీస్ అతిధి గృహన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్

ఈ సమావేశంలో విద్యా కమిటీ చైర్మన్ కుంజా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యా కమిటీ సమావేశానికి ప్రతినెలా తల్లిదండ్రులు విధిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు. మన ఊరు మన బడి లో భాగంగా మన పాఠశాల ఎంపిక కావడం తమకెంతో ఆనందంగా ఉందని, ప్రస్తుతం పాఠశాలలో జరుగుతున్న పనులను పిల్లల తల్లిదండ్రులందరూ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి, ప్రధానోపాధ్యాయులు కృషిని అభినందించారు.

Also Read : నిత్య అన్న ప్రసాద వితరణకు సహకరించండి

పాఠశాలలో చదువుతున్న మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పిల్లలందరికీ పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్థులు అన్నారు పాఠశాలలోని వస్తువులను ఎవరైనా పాడుచేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని విద్యా కమిటీ హెచ్చరించారు. పాఠశాలల్లో ప్రతి వస్తువు తమదిగా భావించి పరిరక్షించుకోవాలని పిల్లలకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏ.వీ సీతారాం,టీ వంశీమోహన్, జీ.రవి, ఎం.సరోజినితోపాటు ఆయా తిరుపతమ్మ పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube