పేదోళ్ళ దేవుడు- ఎన్టీఆర్ ఎన్టీఆర్

పేదోళ్ళ దేవుడు- ఎన్టీఆర్ ఎన్టీఆర్

0
TMedia (Telugu News) :

 

 

 

 

 

 

 

 

 

 

పేదోళ్ళ దేవుడు- ఎన్టీఆర్ ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. -చింత నిప్పు కృష్ణ చైతన్య (జిల్లా అధ్యక్షుడు) తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం. తెలుగు జాతి ఖ్యాతి ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 26 వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం పట్టణంలోని స్థానిక బైపాస్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ మరియు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పగడాల నాగరాజు లతో కలిసి టిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు చైతన్య మాట్లాడుతూ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పి, తన నటనతో మెప్పించి, ఆరు నెలల్లో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో ఎన్ని సంస్కరణలు చేసి పేదల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అట్టడుగు వర్గాల వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించి పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచి, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి రాజకీయంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మహనీయుడు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని నినాదంతో అదే ఇంటికి ఉచిత కరెంటు అందజేసి పేదల జీవితాల్లో వెలుగు నింపాడు. అలాంటి మహనీయుడు అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన్ని స్మరించుకుంటూ 26వ వర్ధంతి నివాళులు అర్పిస్తున్నామని, అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ కు “భారతరత్న” ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు,ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube