గురుకులాల్లో పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు చెల్లించాలి

ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది

0
TMedia (Telugu News) :

గురుకులాల్లో పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు చెల్లించాలి

– ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది

టీ మీడియా, జనవరి 4, వనపర్తి బ్యూరో : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురుకులాల్లో గత ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను తక్షణమే చెల్లించాలని గురువారం వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్ పవర్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,ట్రైబల్ వెల్ఫేర్ లలో గత ఐదు నెలలుగా 5,485 కోట్లు పెండింగ్లో మెస్ బిల్లులు ఉన్నాయి.

Also Read : సంఘం అధ్యక్షులకు ఘన సన్మానం

దీనివల్ల గురుకులాల్లో విద్యార్థులకు సరైన మెనూ అమలు కాకపోవడంతో పాటు నాసిరకంగా మెనూ అమలవుతుంది. తక్షణమే పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కి అందివ్వడం జరిగింది. ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మల్లేష్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube