కొత్త పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన గౌరవ ఎమ్మెల్యే పెద్ది

వారికి కొత్త పెన్షన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వంచే మంజూరు చేపించే బాధ్యత నాదే

1
TMedia (Telugu News) :

 

కొత్త పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన గౌరవ ఎమ్మెల్యే పెద్ది

– మొదటిసారిగా పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులకు నా శుభాకాంక్షలు

– రాజకీయ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు

– అర్హత ఉండి పెన్షన్ కార్డులు రానివారు మాన్యువల్ గా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు

– వారికి కొత్త పెన్షన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వంచే మంజూరు చేపించే బాధ్యత నాదే

– ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు

టీ మీడియా,సెప్టెంబర్ 19, ఖానాపూర్: గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవల మంజూరు చేసిన 10 లక్షల నూతన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో కొత్తగా 12 వేల మందికి ఆసరా పింఛన్లు మంజూరు కాగా.. నేడు ఖానాపూర్ మండలంలోని రంగాపూర్ , కొత్తూరు & రాగంపేట్, ఖానాపూర్, మనుబోతులగడ్డ, బండమిడిమామిడి తండా గ్రామాలకు చెందిన మొత్తం 740 ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను, ధ్రువ పత్రాలను “గౌరవ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లబ్ధిదారులకు అందచేశారు..

Also Read : పినపాకలో పొంగులేటికి ఘన స్వాగతం

ఎమ్మెల్యే పెద్ది గారి కామెంట్స్…

ప్రభుత్వంచే విడుదలై లబ్ధిదారుల చేతులకు నేరుగా ఆసరా పెన్షన్లను అందించి వారి ఆశీర్వదాన్ని పొందే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ అందరి తరుపున నా ధన్యవాదాలు.మొట్టమొదటి సారి పెన్షన్ ఆదుకోవడంలో ఉండే సంతోషం అంతా, ఇంతా కాదు.మొదటిసారిగా రూ. 2016, 3016 పెన్షన్ కార్డులను అందుకున్న లబ్ధిదారులకు నా శుభాకాంక్షలు.ఆసరా పెన్షన్ల మంజూరుకై వయోపరిమితి విషయంలో కేవలం ఓటర్ కార్డును మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది.నర్సంపేట నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయలకతీతంగా సంక్షేమ పథకాలు వస్తున్నాయి.ఇంకా పలు కారణాల వల్ల పెన్షన్ కార్డులు రాని అర్హత ఉన్నవారు మళ్లీ మాన్యువల్ గా ఆఫ్ లైన్ ద్వారా మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.వాటిని పరిశీలన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే మంజూరు చేపించి కొత్త కార్డులను ఇచ్చే బాధ్యత నాదే.రెండు సంవత్సరాల కాలం పాటు కరోనా తీవ్రత వల్ల ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కూడా ఇటీవల 10 లక్షల నూతన పెన్షన్లను మంజూరు చేసిన ఘనత ఒక్క కేసీఆర్ గారిదే.పై కార్యక్రమంలో ODCMS చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్ గారు ,ఎంపిపి వేములపల్లి ప్రకాష్ రావు గారు,జెడ్పిటిసి బత్తిని స్వప్న శ్రీనివాస్ గారు , మండల పార్టీ అధ్యక్షులు వెంకటనర్సయ్య ,గారు ఎంపిటిసిలు, పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు, క్లస్టర్ భాద్యులు, పెన్షన్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube