పెన్షన్ల పంపిణీలో వలంటీర్ల దూకుడు

పెన్షన్ల పంపిణీలో వలంటీర్ల దూకుడు

1
TMedia (Telugu News) :

పెన్షన్ల పంపిణీలో వలంటీర్ల దూకుడు
టి మీడియా, జూన్1అమరావతి: బుధవారం తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు వలంటీర్లు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. సుమారు 60.75 లక్షల మంది పెన్షనర్లకు రూ.1, 543.80 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
ఉదయం 07.00 గంటల వరకు 30.01 శాతం పెన్షన్ల పంపిణీ ద్వారా సుమారు 18.22 లక్షల మందికి రూ.461.92 కోట్లు అందజేశారు వలంటీర్లు. అలాగే.. ఉదయం ఎనిమిది గంటల వరకు 48.27 శాతం పెన్షన్ల పంపిణీ, 29.32 లక్షలమందికి రూ.744.02 కోట్ల అందజేసినట్లు ఏపీ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాల నాయుడు తెలిపారు.
-ఉదయం 09:00 గంటల వరకు 58.52 శాతం పెన్షన్ల పంపిణీ.. 35.55లక్షల మందికి రూ.902.60 కోట్లు అందచేత.
-ఉదయం 10:00 గంటల వరకు 66.15 శాతం పెన్షన్ల పంపిణీ.. 40.18 లక్షల మందికి రూ.1020.68 కోట్లు అందచేత.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube