అర్హులైన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి.

-తహశీల్దార్ కు వినతి పత్రం

1
TMedia (Telugu News) :

అర్హులైన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి.

-తహశీల్దార్ కు వినతి పత్రం

టీ మీడియా,ఏప్రిల్ 14, గోదావరిఖని :

రామగుండం మండలం లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన వారికి ఇవ్వాలని, 57సంవత్సరాలు నిండి గత సంవత్సరం ఆగస్టు నెలలో ఆన్లైన్ చేసుకున్న వృద్దులకు పెన్షన్లు మంజూరు చేయాలని అలాగే ధరణి పోర్ట్ లో జరిగిన అవకతవకలు సరిచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో రామగుండం తహశీల్దార్ రమేష్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కే.కనకరాజ్ మాట్లాడుతూ…టీ ఆర్ ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారం లోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కే సీ ఆర్ యాభై ఏళ్లు నిండిన వారందరూ వృద్ధాప్య పింఛన్ల కోసం ఆన్లైన్ చేసుకోవాలని చెప్పి ఎనిమిది మాసాలు గడుస్తున్న పట్టించుకోవడం లేదని ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వృద్దులు పెన్షన్ కోసం ఆశతో ఎదురుచూస్తు ఆవేదన చెందుతున్నారు అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోశిక మోహన్,ప్రజా సంఘాల నాయకులు కందుకూరి రాజరత్నం,శనిగరపు చంద్ర శేఖర్,అబ్దుల్ కరీం,రేణుకుంట్ల ప్రీతం తదితరులు పాల్గొన్నారు.

Also Read;బాంబు లేదు భయపెట్టారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube