వజ్రోత్సవాలలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి

కలెక్టర్ అను దీప్,ఏం ఎల్ ఏ

1
TMedia (Telugu News) :

వజ్రోత్సవాలలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి
– కలెక్టర్ అను దీప్,ఏం ఎల్ ఏ

టీ మీడియా,ఆగస్టు 9,భద్రాద్రి కొత్తగూడెం: స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులు పాటు చేపట్టిన స్వతంత్ర భారత వత్రోత్సవాలలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు. మంగళవారం కొత్తగూడెం మున్సిపాల్టీలో చేపట్టిన ఇంటింటికి జాతీయ పతాక ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి ఇంటింటికి జాతీయ పతాకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పాడు. ఈ తరం వారికి స్వాతంత్య్ర ఫలాలు సాధనలో త్యాగాలు తెలియచేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. పరాయిదేశ . పాలన నుండి మన దేశానికి విముక్తి కలిగించుటలో ఎందరో మహానుభావులు త్యాగ ఫలాలే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రమని చెప్పారు. అహింసామార్గంలో తుపాకులు పట్టకుండా, పోరాటాలు చేయకుండా అనేక సత్యాగ్రహాలు చేసి మనకు స్వాతంత్ర్యాన్ని అందించారని అటువంటి మహానీయులు త్యాగాలు మనందరం మననం చేసుకోవాలని ఆయన సూచించారు.

 

Also Read : కాంగ్రెస్ నుంచి బిఎస్పి లో చేరిక

 

జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఆగష్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలోని దాదాపు 3.25 లక్షల ఇళ్లకు జాతీయ పతాకాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జాతీయ పతాకాలు పంపిణీ చేసేందుకు 481 గ్రామ పంచాయతీల్లో 2410 టీములు, నాలుగు మున్సిపాల్టీలలోని 104 వార్డుల్లో 127 టీములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జాతీయ పతాక ఆవిష్కరణంలో జాగ్రత్తలు పాటించాలని కాషాయపు రంగు పైన ఉండే విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఎగురవేయాలని చెప్పారు. స్వాతంత్య్ర సాధనలో జరిగిన ఘట్టాలు నేటి తరానికి తెలియచేయాలనే లక్ష్యంతో జిల్లాలోని 6 నుండి 10వ తరగతి చదువుతున్న 60 వేల మంది విద్యార్థులకు ఉచితంగా గాంధీ సినిమా ప్రదర్శన ప్రారంభమైనట్లు చెప్పారు. కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించనున్న ఈ 15 రోజులు వత్రోత్సవ కార్యక్రమాల్లో ప్రజలు చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని 15 కేంద్రాల్లో ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు గాంధీ సినిమా ప్రదర్శన జరుగుతుందని, విద్యార్ధులు పర్యవేక్షణకు రవాణా, విద్యా, పోలీస్, రెవిన్యూ అధికారులను నియమించినట్లు చెప్పారు.ఎస్పీ డాక్టర్ వినీత్, మున్సిపల్ ఛైర్పర్సన్ తదితరులు 75 సంవత్సరాల వబ్రోత్సవ వేడుకలు నిర్వహణ గురించి ప్రసంగించారు.అనంతరం కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్ విద్యార్థులతో కల్సి పూర్ణా పిక్చర్ ప్యాలెస్లో గాంధీ సినిమా వీక్షించారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్,ఆర్డీఓ స్వర్ణలత, మున్సిపల్ కమిషనర్ నవీన్, తహసిల్దార్లు రామక్రిష్ణ, క్రిష్ణప్రసాద్, నాగరాజు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ దామోదర్, కౌన్సిలర్ అలున్నీసా బేగం, అన్ని వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube