సి.సి. కెమెరాల ఏర్పాటు కు ప్రజలు సహకరించాలి

-చైర్ పర్సన్ జంగం కళ

1
TMedia (Telugu News) :

సి.సి. కెమెరాల ఏర్పాటు కు ప్రజలు సహకరించాలి

-చైర్ పర్సన్ జంగం కళ

టీ మీడియా, నవంబర్ 10, రామకృష్ణాపూర్ : సి.సి కెమెరాల ఏర్పాటు కు రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ ప్రజలు సహకరించాలని చైర్ పర్సన్ జంగం కళ అన్నారు.గురువారం ఒకటో వార్డు రామాలయం చౌరస్తా లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పట్టణ ఎస్.ఐ అశోక్,వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణలతో కలిసి ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణ ఎస్.ఐ చొరవ తో ఒకటో వార్డు కౌన్సిలర్ పోగుల మల్లయ్య ఆధ్వర్యంలో రామాలయం సెంటర్ షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారస్తులు, తమ యొక్క సహాయ సహకారాలు అందించగా సి.సి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Also Read : సర్పంచ్ ఉమ్మనేని బాబు సమక్షంలో టిఆర్ఎస్ లోకి చేరికలు

ఈ కార్యక్రమం లో మున్సిపల్ కౌన్సిలర్ లో జాడి శ్రీనివాస్,పార్వతి విజయ, రామాలయం సెంటర్ వ్యాపారస్తులు సత్తయ్య, సెలెక్ట్ కుమార్,బత్తిని రవి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రవి, మెడికల్ షాప్ నిర్వాహకులు రమేష్,అమర్ నాథ్,కాలనీ వాసులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube