కంట్రోలర్ సమయపాలన మార్చడంతో ఇబ్బందుల్లో ప్రజలు

కంట్రోలర్ సమయపాలన మార్చడంతో ఇబ్బందుల్లో ప్రజలు

1
TMedia (Telugu News) :

కంట్రోలర్ సమయపాలన మార్చడంతో ఇబ్బందుల్లో ప్రజలు

టీ మీడియా, ఏప్రిల్ 25, జన్నారం:మండలకేంద్రంలోని ఆర్ టి సి కంట్రోలర్ సమయపాలన మార్చడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలకేంద్రంలోని ఆర్ టి సి కంట్రోలర్ కార్గో సేవలు గతంలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వుండేవి ఇప్పుడు అధికారులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చేశారు. దీంతో ప్రయానికులు కార్గో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల లోపు హైదరాబాద్, కరీంనగర్ ,వరంగల్ ,మంచిర్యాల, తదితర ప్రాంతాలనుండి అనేక రకాల వస్తువులు కార్గో ద్వార ఇక్కడకు వస్తాయి.

Also Read : పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ

కంట్రోలర్ లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కార్గో వచ్చిన తరువాత ట్రాన్స్ పోర్ట్ సేవలు సులబతరం అయినాయి అనుకుంటే ,అదికారులు నిర్వాకం వలన ఇబ్బందులు పడుతున్నామని మండలవాసులు అంటున్నారు. ఉన్నత అధికారులు ఈ సమస్యపై దృష్టిపెట్టాలని వెంటనే పాత పద్ధతిలో కంట్రోలర్ను ఏర్పాటు చేయాలని మండలవాసులు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube