ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలి

ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలి : పొన్నం

1
TMedia (Telugu News) :

ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలి : పొన్నం

టీ మీడియా, సెప్టెంబర్ 09, మధిర: ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు పట్టణంలోని బోడేపూడి భవనంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి అధ్యక్షతన మధిర పట్టణ ,మండల సభ్యుల జనరల్ బాడీ సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…. కేంద్ర ప్రభుత్వా౦ ప్రజలపై అనేక భారాలను మోపే ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్మి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని.ఇప్పటికే ప్రజలపై జిఎస్టి పేరుతో పన్నులు పెంచే నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెంచిందన్నారు.

 

Also Read : మృతుల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటాం

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో వైఫల్యం చెందిందని పేర్కొన్నారు.
ఆసరా పెన్షన్లు పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అర్హులైనవారికి పెన్షన్లు అందించటంలో ప్రభుత్వం అధికారుల వైఫల్యం చెందారన్నారు. మధిర మున్సిపాల్టీలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని వెంటనే అధికారులు వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినారు.ప్రజలు ప్రజా పోరాటాల ద్వారానే తమ సమస్యలను పరిష్కరించాలని పోరాటాల ద్వారానే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందనారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానాలను వెంటనే అమలుపరచాలని ,లేనిపక్షంలో ప్రజల తరపున ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు శీలం నర్సింహారావు , మండల కార్యదర్శి మంద సైదులు, పట్టణ కమిటీ సభ్యులు అధిక తేలప్రోలు రాధాకృష్ణ, పడకంటి మురళీ ,మండల కమిటీ సభ్యులు మద్దాల ప్రభాకర్ ,ఓట్ల శంకర్రావు,లక్షలకు లతో పాటు పట్టణ , మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube