బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 24, కర్నూలు జిల్లా:

ఒమిక్రాన్ (కరోనా) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలు , పని ప్రదేశాలు , ప్రయాణాల్లో ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా తగ్గిందని అధికారులు , ప్రజలు ఎవరు కూడా మాస్కులు ధరించడం లేదు, ఒమిక్రాన్ వెరియంట్ , డెల్టా వెరియంట్ కంటే 3 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు తెలుపుతున్నారు. బహిరంగ ప్రదేశాలలో ప్రజలు గుంపులు, గుంపులుగా చేరి ఒమిక్రాన్ వెరియంట్ వ్యాప్తికి కారకులు కావద్దన్నారు. మాస్కులు లేకుండా తిరిగే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. జరిమానాలువిధిస్తామన్నారు.వాణిజ్య సముదాయాలు, మల్టిప్లెక్సులు, సినిమా హాళ్ళు తదితర వాటిలలో మాస్కులు ధరించే విధంగా యజమానులుచర్యలుతీసుకోవాలని ఆదేశాలిస్తున్నామన్నారు.

ప్రజలు నిర్లక్ష్యంగా మాస్కులు లేకుండా తిరిగితే ఒమిక్రాన్ (కరోనా) కేసులు రోజు రోజూకు పెరిగే అవకాశం ఉందన్నారు. బాధ్యతగల పౌరులుగా ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణకు సహాకరించాలన్నారు.
ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి కరోనా(ఒమిక్రాన్) వ్యాప్తి నివారణకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి వాటిని పాటించి జిల్లా పోలీసు యంత్రాంగానికి సహాకరించాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube