ఇటువంటి స్వభావం కల వ్యక్తులు స్వార్ధానికి ఉపయోగించుకుంటారు

ఇటువంటి స్వభావం కల వ్యక్తులు స్వార్ధానికి ఉపయోగించుకుంటారు

1
TMedia (Telugu News) :

ఇటువంటి స్వభావం కల వ్యక్తులు స్వార్ధానికి ఉపయోగించుకుంటారు

లహరి, డిసెంబర17, ప్రతినిధి : చాణక్యుడు ప్రకారం.. కొంతమంది ప్రజలు తమ జీవితంలో పురోగతి కోసం దురాశతో ఇతరులను ఇష్టారీతిన ఉపయోగించుకుంటారు. అంతేకాదు.. ఇలాంటి వారు అవతలి వారిని వదలరు.. వెంబడించి మరీ తమ అవసరాలను తీర్చుకుంటారు. ఇటువంటి స్వభావం కల వ్యక్తులు ఇతరులను తమ స్వార్ధానికి ఉపయోగించుకుంటారు.. దూరంగా ఉండమంటున్న చాణక్యఆచార్య చాణక్యుడు మంచి దౌత్యవేత్త మాత్రమే కాదు.. వ్యూహకర్త , ఆర్థికవేత్తగా కూడా పరిగణించబడ్డాడు.

అంతేకాదు మంచి గురువు కూడా.. అతను చెప్పిన విషయాలు చాలా సందర్భోచితంగా ఉన్నాయి. ప్రజలు నేటికీ చాణుక్యడు చెప్పిన నీతి శాస్త్రంలోని విషయాలను తమ జీవితాల్లో అన్వయించుకుంటారు. చాణక్యుడి విధానాలు మొదటి నుంచి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. చాణక్యుడు ప్రకారం.. కొంతమంది ప్రజలు తమ జీవితంలో పురోగతి కోసం దురాశతో ఇతరులను ఇష్టారీతిన ఉపయోగించుకుంటారు. అంతేకాదు.. ఇలాంటి వారు అవతలి వారిని వదలరు.. వెంబడించి మరీ తమ అవసరాలను తీర్చుకుంటారు. చాణక్య తన నీతి శాస్త్రంలో ఎటువంటి వ్యక్తులు.. ఎటువంటి పరిస్థితిలో ఎలాంటి వ్యక్తుల నుంచి ప్రయోజనం పొందుతారో తెలుసుకుందాం..
ప్రజలు ఎప్పుడూ ఇలాంటి వారిని మోసం చేస్తారు.. అంటూ ఓ ఉదాహరణ చెప్పాడు చాణక్య.. అడవిలో పెరిగే నిటారుగా నేరుగా ఎటువంటి వంకర లేని చెట్లను ఎలా మొదట నరకడానికి ఎంచుకుంటారో.. అదే విధంగా అమాయకంగా, సూటిగా ఉండే వ్యక్తులను కొంతమంది తమ అవసరాలకు ఉపయోగించుకుంటాడని పేర్కొన్నాడు.

Also Read : వివాహ సమానత్వాన్ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఒక వ్యక్తి మితిమీరిన అమాయకత్వంతో లేదా సూటిగా ఉండకూడదని చాణక్యుడు చెప్పాడు. ఎప్పుడూ నిటారుగా ఉండే చెట్లను ముందుగా నరికి వేస్తారని.. వంకరగా ఉన్నవి నిలబడి ఉంటాయని చాణక్యుడు చెప్పాడు. సూటిగా మాట్లాడే వ్యక్తుల నుంచి ఇతరులు తరచుగా ప్రయోజనాన్ని పొందుతారు.. వీరి దీనిని త్వరగా గ్రహించలేరు.చాణక్య నీతి ప్రకారం.. ఒకరిని అతిగా నమ్మడం మంచిది. ఇది అతిగా నమ్మితే నష్టాలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. గుడ్డి విశ్వాసం పెను ప్రమాదానికి దారి తీస్తుందని ఆచార్య చెప్పారు. అతిగా నమ్మే వారు తరచుగా మోసాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరిని నమ్మినా వారి స్వార్ధానికి ఉపయోగపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube