పబ్లిక్ టాయిలెట్స్ లేక అవస్థలు పడుతున్న ప్రజలు

పబ్లిక్ టాయిలెట్స్ లేక అవస్థలు పడుతున్న ప్రజలు

1
TMedia (Telugu News) :

పబ్లిక్ టాయిలెట్స్ లేక అవస్థలు పడుతున్న ప్రజలు

టీ మీడియా, ఏప్రిల్ 29, జన్నారం:

జన్నారం మండల కేంద్రం దిన దినం అభివృద్ధి చెందుతుంది. నిత్యం పట్టణం జనంతో రద్దీగా ఉంటుంది జన్నారం పట్టణం  నాలుగు జిల్లాలకు సరిహద్దుగా ఉండడంతో  పట్టణనికి ప్రజలు ప్రతి రోజూ  రాకపోకలు సాగిస్తుండడం వల్ల జన్నారం లోని మెయిన్ రోడ్ నిత్యం రద్దీగా ఉంటుంది.

Also Reda : ఏపీకి పెండింగ్‌ బకాయిలు చెల్లించండి: సుప్రీంకోర్టు

నిత్యావసర వస్తువుల మొదలుకొని గృహోపకరణ, హాస్పిటల్ , వారసంత , స్కూల్స్, కాలేజెస్,తదితర పనులకోసం సమీప గ్రామాల నుండి ప్రజలు పట్టణంలోకి వస్తుంటారు . పట్టణంలో పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టిసారించి  పట్టణం లోని ప్రధాన కూడలిల వద్ద టాయిలెట్స్ నిర్మించాలని అందుకు వీలుకాకుంటే మొబైల్ టాయిలెట్స్ ఐనా పెట్టిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube