జిల్లా పోలీసుల పనితీరు భేష్

-తెలంగాణ- ఛత్తీస్ఘడ్ సరిహద్దులో పర్యటన

1
TMedia (Telugu News) :

జిల్లా పోలీసుల పనితీరు భేష్

– డీజిపి ఎం.మహేందర్ రెడ్డి

-తెలంగాణ- ఛత్తీస్ఘడ్ సరిహద్దులో పర్యటన

టీ.మీడియా,అక్టోబర్20,వెంకటాపురం : తెలంగాణ రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్ రెడ్డి ఐపీఎస్ చర్ల మండలంలోని పూసుగుప్పలో నూతనంగా నిర్మితమవుతున్న సీఆర్పీఎఫ్ క్యాంప్ ను సందర్శించారు.ముందుగా హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుండి పూసుగుప్పకు చేరుకున్న డీజీపీ గారికి జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.డీజీపీ తో పాటు అడిషనల్ డీజీ గ్రేహౌండ్స్ కె.శ్రీనివాసరెడ్డి ఐపిఎస్,నార్త్ జోన్ అడిషనల్ డీజీ వై.నాగిరెడ్డి ఐపిఎస్,ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు లు కూడా ఉన్నారు.

మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించేందుకు తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన పూసుగుప్పలో భద్రతా బలగాల కోసం క్యాంపు నందు నూతనంగా ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు.అనంతరం అక్కడ నిత్యం విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Also Read : ఆఫీస్ ఆటో మేషన్ ఎగ్జామ్ నిర్వహించాల

వీలైనంత త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ వారి కార్యకలాపాలను నిరోధిస్తున్న జిల్లా పోలీసుల పనితీరు ప్రశంసనీయం అన్నారు.ఆనంతరం పూసుగుప్ప నుండి హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లా వెంకటాపురం చేరుకుని అక్కడ పోలీస్ స్టేషన్లో భద్రాద్రి కొత్తగూడెం,ములుగు,భూపాలపల్లి,మహబూబాద్ జిల్లాల ఎస్పీలతో పాటు ఇతర పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఐపిఎస్,మహబూబ్బాద్ ఎస్పీ శరత్ ఐపీఎస్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్,జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ జె.సురేందర్ రెడ్డి,ములుగు ఓఎస్డీ గౌస్ అలాం ఐపిఎస్, కొత్తగూడెం ఓఎస్డీ టి.సాయి మనోహర్,భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్,ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్,ములుగు ఏఎస్పీ సుధీర్ ఐపిఎస్,ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఐపిఎస్ మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube