క్రెడిట్ కార్డుతో యూపీఐ లింకింగ్‌కు ఆర్బీఐ అనుమ‌తి

క్రెడిట్ కార్డుతో యూపీఐ లింకింగ్‌కు ఆర్బీఐ అనుమ‌తి

1
TMedia (Telugu News) :

క్రెడిట్ కార్డుతో యూపీఐ లింకింగ్‌కు ఆర్బీఐ అనుమ‌తి
ముంబై జూన్ 8, : డిజిట‌ల్ పేమెంట్స్‌ను మ‌రింత విస్తృతం చేసేందుకు ఆర్బీఐ కొత్త చ‌ర్య‌కు శ్రీకారం చుట్టింది. యూపీఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌)తో క్రెడిట్ కార్డుల‌ను లింక్ చేసేందుకు ఆర్బీఐ ప్ర‌తిపాద‌న చేసింది. ఈ విధానాన్ని రూపే కార్డుల‌తో ప్రారంభించ‌నున్న‌ట్లు ఆర్బీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దీని వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత సులువైన రీతిలో పేమెంట్స్ చేసుకునే వీలు ఉంటుంద‌ని ఆర్బీఐ అభిప్రాయ‌ప‌డింది. అయితే దీనికి కావాల్సిన వ్య‌వ‌స్థ‌ను మ‌రింత మెరుగుప‌డాల్సి ఉంద‌ని ఆర్బీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. ఈ కొత్త విధానానికి సంబంధించి నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వ‌నున్న‌ట్లు ఆర్బీఐ వెల్ల‌డించింది.

 

Also Read : డాక్టర్ల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు…

ప్ర‌స్తుతం యూపీఐ సౌక‌ర్యం డెబిట్ కార్డు యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఉంది. డెబిట్ కార్డు యూజ‌ర్ల‌కు ఉన్న‌ సేవింగ్స్ లేదా క‌రెంట్ అకౌంట్ల‌తో యూపీఐ లావాదేవీలు జ‌రుగుతున్నాయి. దేశంలో ప్ర‌స్తుతం యూపీఐ పేమెంట్స్‌కు ఎక్కువగా జ‌రుగుతున్నాయి. దేశంలో 26 కోట్ల మంది విశిష్ట యూపీఐ యూజ‌ర్లు ఉన్నారు. యూపీఐ ఫ్లాట్‌ఫామ్‌లో మ‌రో 5 కోట్ల మంది వ‌ర్త‌కులు కూడా ఉన్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.యూపీఐ ద్వారా మే నెల‌లో 594.63 కోట్ల లావాదేవీలు జ‌రిగాయి. ఆ లావాదేవీల మొత్తం సుమారు 10.40 ల‌క్ష‌ల కోట్లు ఉన్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube