మడ్డి మత్తులో …పెట్రొల్ యాజమాన్యం

0
TMedia (Telugu News) :

 

మడ్డి మత్తులో …పెట్రొల్ యాజమాన్యం

-కళ్ళ ముందే కల్తీ దోపిడీ…
-మడ్డి కలిసిన ఆయిల్..నాడ, ప్రతినిధి న్యూస్:- జిల్లా లో కల్తీ రాజ్యం ఏలుతుంది. పెట్రో కల్తీ దోపిడీ కి అడ్డు అదుపు లేదు.పెట్రోల్ బంక్ ల మాయాజాలం కు అంతం లేనే లేదు. కొన్ని బంక్ లలోమడ్డి కలిసిన ఆయిల్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ద్విచక్ర వాహనాలుమరమ్మతులకు గురి అవుతున్నాయి. దీంతో
వాహన దారులు గోగ్గోలు పెడుతున్నారు. విజిలెన్స్ అధికారులు వెంటనే
అన్ని పెట్రోల్ బంక్ లు తనిఖీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: పేకాట, జూదం తో చిన్నాభిన్నం అవుతున్న కుటుంబాలు..!

కల్తీతో వాహనాల రిపేర్లు..
నింబంధనల ప్రకారం లీటరుకు 5 ఎంఎల్‌ ఇంధనం తక్కువగా రావొచ్చు. అంతకంటే ఎక్కువగా వస్తే అనుమానించాల్సిందే. కొన్ని బంకుల్లో 50 ఎంఎల్‌ నుంచి 100 ఎంఎల్‌ వరకు తేడా వస్తున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. మరి కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్‌లో రేషన్‌ కిరోసిన్‌ను కలిపి విక్రయిస్తున్నారని, దీంతో వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గత రెండు రోజులుగా ఓ మండలం లో ఇలా ఆయిల్ కల్తీ వల్ల దాదాపు 100 వాహనాలు మరమ్మతులు కు గురయ్యాంటే పరిస్థితి ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. గోదాములు నుంచి బంకుకు సరఫరా చేసే క్రమంలోనే కల్తీ జరుగుతున్నట్లు సాక్షాత్తు అధికారులే అంగీకరిస్తుండటం గమనార్హం. అన్ని బంక్ ల్లో ఈ పరిస్థితి లేదు. కొన్ని బంకు లు నాణ్యమైన పెట్రోల్ అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మీడియాకు కబేళా ముడుపులు ..!

ఎవరేం చేయాలి..
రికార్డుల్లో చూపినట్లుగా నిల్వలు న్నాయా లేదా, నిర్వహణ తీరు తదితర అంశాలు ను పరిశీలించాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖది. పెట్రోల్, డీజీల్‌ను సరిగ్గా కొడుతున్నారా.. వాహనాల్లో నింపే క్రమంలో అక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా.. ఇంధనం పోసే యంత్రాలను తూనికలు, కొలతలు శాఖధికారులు ఎప్పటికప్పుడు తనీఖీ చేయాలి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube