వివాహ సమానత్వాన్ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
టి మీడియా, డిసెంబర్ 16, న్యూఢిల్లీ: ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహ సమానత్వాన్ని కల్పించాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. షాదన్ ఫరాసత్ అనే న్యాయవాది ఈ పిటిషన్ గురించి సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు లాయర్ ఫరాసత్ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ పిటిషన్ గురించి వివరంగా తెలుసుకున్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. కోర్టు శీతాకాల సెలవులు ఉన్నందున, శీతాకాల సెలవుల అనంతరం ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఇటీవల కూడా ఒకే జండర్‌కు చెందిన రెండు జంటలు ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆ రెండు వేర్వేరు పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
Also Read : బీఈ పీసీవీ14 వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి
ప్రత్యేక వివాహచట్టం కింద వారి వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ఈ మేరకు గత నెల 25న ఈ పిటిషన్లకు సంబంధించి స్పందన తెలుపాలంటూ కేంద్రానికి నోటీసులు కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, కేరళ తదితర హైకోర్టుల్లో సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్ల గురించి కూడా సుప్రీంకోర్టు కేంద్రానికి ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube