కోడీమ్యాల : అక్టోబర్ 25 ( టీ మీడియా ప్రతినిధి )
జగిత్యాల జిల్లా కోడీమ్యాల మండల తహసీల్దార్ స్వర్ణ కి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కేవెంజర్ లను నియమించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సోమవారం సాయంత్రం వినతిపత్రం ఇచ్చినారు.
బోధన ప్రారంభమైన సమయంలో పాఠశాలల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతి, మునిసిపాలిటి వారికి అప్పగిస్తూ, ప్రత్యక్ష బోధనను కోవిడ్ -19 ప్రోటోకాల్ పాటిస్తూ కొనసాగించవలెనని ఆదేశాలు జారీచేశారు.
ప్రతిరోజు తరగతి గదులు, పాఠశాల ఆవరణ, త్రాగునీటి స్థలము , టాయిలెట్లు , మధ్యాహ్న భోజన నిర్వహణ, స్థలములను శుబ్రపరుస్తూ, సానిటైజ్ చేయవలసి ఉన్నది. కానీ గ్రామ పంచాయతి / మునిసిపాలిటి లో సరియగు సిబ్బంది లేక, వారికి వేరు వేరు ఇతర పారిశుద్ధ్య పనులు ఉన్న దృష్ట్యా పాఠశాలలను ప్రతిరోజూ శుభ్రం చేయలేకపోతున్నారు.
ఇలాంటి పరిస్థితులలో కోవిడ్ నిబంధనలను పాటించే పరిస్థితులు లేక, అటు గ్రామ పంచాయతి / మునిసిపాలిటీ సిబ్బందికి ప్రతి రోజు నిర్వహించే అవకాశము లేక ప్రధానోపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పాఠశాలలు అపరిశుభ్రతకు నిలయాలై స్వచ్చ రహిత పాఠశాలలుగా మారి, COVID-19 ప్రోటోకాల్ పాటించలేక, విద్యార్థుల అనారోగ్యానికి దారి తీసే ప్రమాదము కలదు.
కావున వెంటనే పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియామకము చేయగలరని మీ ద్వారా ప్రభుత్వానికి ప్రాతినిధ్యము
చేయుచున్నాము.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి నాంపెళ్లి మల్లేశం, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి ఏనుగు ఆదిరెడ్డి, మండల అధ్యక్షుడు గుడి భూపతి రెడ్డి, ముమ్మాడి హరికృష్ణ, ఎర్రోజు మోహనాచారి, తదితరులు పాల్గొన్నారు.