టీ మీడియా, డిసెంబర్ 15 మణుగూరు .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో సీనియర్ జర్నలిస్ట్ అయిన ఆంధ్రప్రభ జిల్లా ప్రతినిధి పై అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. మణుగూరు ప్రెస్ క్లబ్ మరియు ఐజెయూ పరిధిలో, స్థానిక మండల తహశీల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా.. మణుగూరు ప్రెస్ క్లబ్ వారు మాట్లాడుతూ, జర్నలిస్టుల ప్రాణాలు పనంగా పెట్టి, రాత్రి పగలు తేడా లేకుండా., కరోనా కష్ట కాలంలో కూడా కుటుంబ బరువు బాధ్యతలు పక్కన పెట్టి, తను నమ్మిన వృత్తి కి న్యాయం చేకూరాలని, నిద్ర హారాలు మానుకొని ప్రతిక్షణం ప్రజా సమస్యల పట్ల నిరంతరం వార్తలు మోసుకొచ్చేది ఒక జర్నలిస్ట్.
తన ప్రాణానికి ఆపద వుంది అని తెలిసినా.. లెక్కచేయకుండా.., గల్లీ వార్తల నుండి ఢిల్లీ వార్తల వరకు ప్రజలకు చేరువేసేది ఒక్క జర్నలిస్టులు మాత్రమే.అలాంటిది జర్నలిస్టుల పై తప్పుడు కేసులు పెడుతూ.. ఉద్దేశ్య పూర్వకంగా కక్షతో ప్రశ్నించే ప్రజా గొంతుకను, వార్తల సేకరణలో భాగంగా., నిజాన్ని కప్పిపుచ్చుకునేందుకే కొందరు వ్యక్తులు తప్పుడు కేసులతో కలాని కి సంకెళ్లు వేసే ప్రయత్నం చేయడం, నిజాన్ని అనిచివేసే ప్రయత్నం చేయడం చాలా భాధాకరం. కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అయినటువంటి ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర్లు పై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో మణుగూరు ప్రెస్ క్లబ్ మరియు ఐజెయూ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.