డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం అందించిన బి.ఎస్.పి నాయకులు

డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం అందించిన బి.ఎస్.పి నాయకులు

1
TMedia (Telugu News) :

డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం అందించిన బి.ఎస్.పి నాయకులు

టీ మీడియా , జులై 5,దమ్మపేట:బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అధ్యక్షులు మడకం ప్రసాద్ ఆధ్వర్యంలో పలు డిమాండ్స్ తో ప్రతి తాసిల్దార్ కార్యాలయంలో మేమేరండం ఇవ్వటం జరిగింది, గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు వెంటనే ఇవ్వాలి, రైతులందరికీ లక్ష రూపాయలు లోపు రుణమాఫీ చేస్తానన్న హామీ వెంటనే అమలు చేయాలి, నిరుద్యోగులకు ప్రతినెల 3016 రూ ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటికి ఇవ్వడం లేదు కావున ప్రతి నిరుద్యోగునికి వెంటనే ఇవ్వాలి, కొత్తగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ నీ రద్దుచేసి దాని స్థానంలో ఆన్లైన్ విధానాన్ని కొనసాగించాలినీ పలు డిమాండ్స్ లో మేమేరడం దమ్మపేట మండలం డిప్యూటీ తాసిల్దార్ కి ఇవ్వడం జరిగింది,

 

Also Read : చరిత్రలో తొలిసారిగా తిరుమల వెంకన్నకు రికార్డు స్థాయిలో ఆదాయం

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ,మామిడి కృష్ణయ్య, నియోజకవర్గం ప్రచార కార్యదర్శి, కాసిని వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు జుజ్జురి వెంకటేశ్వరరావు, దమ్మపేట మండల అధ్యక్షులు చిన్న బాబు, కార్యవర్గ సభ్యులు పలు గ్రామ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube