రైల్వే సమస్యలపై వినతి పత్రం అందజేత
– కన్నూరి సతీష్ కుమార్
టీ మీడియా, నవంబర్ 25, గోదావరిఖని : రామగుండం రైల్వేస్టేషన్ లో పర్యటించిన ద.మ.రైల్వే జి.యం అరుణ్ కుమార్ జైన్,కు పలు రైల్వే సమస్యలపై 20వ డివిజన్ కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ శుక్రవారం వినతి పత్రం అందించారు.కుందనపల్లి,పెద్దంపేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు చెపట్టాలని జి.యం ను కోరడం జరిగింది.ఈ సందర్భంగా కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ…రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలొ రైల్వే జియం ని పలు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇవ్వడమైనదని, రామగుండం నియోజక వర్గం అనేక పరిశ్రమల నిలయమని,ఇక్కడికి దేశంలొని అన్ని ప్రాంతాల వారి రాకపోకలు ఉంటాయని అందుకని నవజీవన్,ఆనందవన్, తమిళనాడు, స్వర్ణజయంతి,మిలీనియం, లోకమాన్య తిలక్, సంఘమిత్ర,తడోబ,గోవా ఎక్స్ప్రెస్, జైపూర్, యశ్వంతపూర్,గయ ఎక్స్ప్రెస్, కర్ణాటక సంపర్ క్రాంతి ,పాట్నా, ఎర్నాకులం,కొంగు,జోద్ పూర్ లాంటి ట్రైన్ లు అన్నింటి ఇక్కడ హల్టింగ్ ఇవ్వాలని కోరామని,
Also Read : బంగారు పతకం అందుకున్న కొల్లాపూర్ వాసి
ఎన్నో ఏండ్లుగా ఇక్కడ పార్కింగ్ కు టెండర్లు వేయడం తద్వార పార్కింగ్ చేసిన వాహనలు సరిపడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలొ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్,ఉప్పరి లక్ష్మణ్,శివరాత్రి గంగాధర్, తంబాడి శంకర్,కొమ్మరాజుల శ్రీను, కనుకుంట్ల రాకేష్,రవివర్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.