పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలి

వాహనానికి తాళ్లతో లాగుతూ నిరసన

1
TMedia (Telugu News) :

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలి.
– వాహనానికి తాళ్లతో లాగుతూ నిరసన
టిమీడియా, ఏప్రిల్ 9, జూలూరుపాడు: ప్రధాన రహదారిపై సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం. ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజానీకం తీవ్ర అవస్థలు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సిపిఐ జూలూరుపాడు మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు విమర్శించారు శుక్రవారం ప్రధాన రహదారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు మోడీ ఊడిగం చేస్తున్నారని సామాన్య ప్రజలు పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరిత విధానాలు అవలంభిస్తూ సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాలు చెల్లాచెదురు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎల్లంకి మధు సిరిపురపు వెంకటేశ్వర్లు వల్ల మల్ల సామేలు గార్లపాటి వీరభద్రం గుడిమెట్ల సీతయ్య తాతా నరసింహారావు ఎస్కే బోలే మియా పత్తిపాటి మహేష్ ఎస్.కె చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Also Read : తెలంగాణ ధాన్యాన్ని కొనాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube