పొగాకు ఉత్పత్తుల పట్టివేత

పొగాకు ఉత్పత్తుల పట్టివేత

0
TMedia (Telugu News) :

నిషేదిత పొగాకు ఉత్పత్తుల పట్టివేత

పెద్దపల్లి జిల్లా: ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను మంగళవారం టాస్క్ ఫోర్స్ ఎస్ఐ షేక్ మస్తాన్ పట్టుకున్నారు. అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని వెంకటరమణ కిరాణంలో తనిఖీ నిర్వహించగా రూ. 1, 04, 000 విలువ గల ప్రభుత్వ నిషేదిత పొగాకు ఉత్పత్తులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని షాప్ యజమాని ఎలకంటి వెంకటరమణని అదుపు లోనికి తీసుకుని, విచారణ నిమిత్తం ముత్తారం పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మహేందర్, రవి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube