ఉద్యోగాల భర్తీ ప్రకటనపై – యువజన విభాగం ఆధ్వర్యంలో మిన్నంటిన సంబరాలు
ఖమ్మం :తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా 91,142 ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేసిన ప్రకటన సందర్భంగా టిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణచైతన్య ఆధ్వర్యంలో ఖమ్మం తెలంగాణ భవన్లో యువత పెద్ద ఎత్తున తరలివచ్చి బాణసంచా కాల్చి, డబ్బులు నృత్యాలతో స్వీట్లు పంచుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలు మరియు పులాబిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొనీ యువతకు సీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
alsoreadక్రిప్టోలో పెట్టిన రూ.25 లక్షలు హాంఫట్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన్ ఇప్పటికే ఒక లక్షా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, రెండో దఫాగా 91,142 ఉద్యోగాల భర్తీ కోసంఅసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షణీయమని అన్నారు.సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాలు లేక తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గ్రహించిన యువత పెద్ద ఎత్తున నిధుల కోసం నియామకాల కోసం ఉద్యమించారు.అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. పోరాట పటిమ గల నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యువత ఉద్యోగ భవిష్యత్తు కోసం ఉద్యోగాలను భర్తీ చేస్తూ వస్తున్నారు.తద్వారా యువతకు మెండుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి.
also read:కానిస్టేబుల్ కి శ్రీమంతం.
ఉన్నత విద్యకు మార్గం సులువయిందనీ అన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేసిన ప్రకటన యావత్ తెలంగాణ నిరుద్యోగ యువకులకు సంతోషకరమైన వార్త అని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టిందని అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా నియమించిందని,
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు యువత కోసం వారి భవిష్యత్తు కోసం ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ప్రకటన చేయడం అదే విధంగా 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరణ చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటన చేయడం వల్ల నిరుద్యోగ యువత లో ప్రభుత్వంపై మరింత నమ్మకం ఏర్పడిందని ఆయన అన్నారు. ఉద్యోగనియామకాలపై కుటిల రాజకీయాలు చేస్తున్నా ప్రతిపక్షాలు ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలని ఆయన అన్నారు.
also read:ఏఎస్పీ ఆఫీసులో మహిళా దినోత్సవ వేడుకలు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,కమర్తపు మురళి,తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్లు షేక్ బాజీ బాబా బోజెడ్ల దిలీప్ కుమార్, టిఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు దేవభక్తిని కిషోర్, మాటేటి కిరణ్, బలుసు మురళీకృష్ణ, కొమ్ము విజేత, రడం సురేష్, లింగ పోయిన సతీష్, దరిపల్లి వీరబాబు, టిఆర్ఎస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube