ఫోటో కాంపిటీషన్ లో మొదటి బహుమతి..

ఫోటో కాంపిటీషన్ లో మొదటి బహుమతి..

1
TMedia (Telugu News) :

ఫోటో కాంపిటీషన్ లో మొదటి బహుమతి..
టీ మీడియా, ఏప్రిల్ 24, రామకృష్ణాపూర్:కరోనా కష్టకాలంలో ప్రజలు పడ్డ బాధల్ని అద్దం పట్టేలా తీసిన ఫోటోలతో హైద్రాబాద్ కి చెందిన రైస్ ఏ.టీ.ఎం. వారు కాంపిటీషన్ నిర్వహించారు. ఈ పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫోటో జర్నలిస్టులు పాల్గొనగా, మంచిర్యాల జిల్లా టేకుమట్ల గ్రామానికి చెందిన మహేష్ కి మొదటి బహుమతి వచ్చింది. మహేష్ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ద టైమ్స్ ఆఫ్ ఇండియా కి ఫోటోజర్నలిస్టుగా విజయవాడ లో పనిచేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలని తన ఫొటోలో బంధించారు మహేష్. హైద్రాబాద్ రవీంద్ర భారతి లో జరిగిన బహుమతి ప్రదానోత్సవం లో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ మరియు సినీ సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్ గార్ల చేతుల మీదుగా మొదటి బహుమతి అందుకున్నారు.

Also Read : పెట్రోల్ తక్కువ వస్తుంది అన్నందుకు మూకుమ్మడిగా దాడి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube