మ‌హిళా లాయ‌ర్‌ను త‌న్నిన ఫోటోగ్రాఫ‌ర్‌

వీడియో వైర‌ల్

1
TMedia (Telugu News) :

మ‌హిళా లాయ‌ర్‌ను త‌న్నిన ఫోటోగ్రాఫ‌ర్‌

-వీడియో వైర‌ల్
టి మీడియా,మే16,బెంగ‌ళూరు : ఓ వ్య‌క్తి పశువులా ప్ర‌వ‌ర్తించాడు. అంద‌రూ చూస్తుండ‌గానే న‌డిరోడ్డుపై మ‌హిళా న్యాయ‌వాదిని త‌న్నాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బాగ‌ల్‌కోట్ జిల్లాలోని వినాయ‌క్ న‌గ‌ర్‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.బాగ‌ల్‌కోట్‌కు చెందిన మ‌హంతేష్ అనే వ్య‌క్తి స్థానికంగా ఉన్న యూనివ‌ర్సిటీలో ఫోటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. మ‌హంతేష్ ఇంటి ప‌క్క‌నే సంగీత అనే లాయ‌ర్ కూడా నివ‌సిస్తోంది. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య గ‌త కొంత‌కాలం నుంచి వివాదాలు కొన‌సాగుతున్నాయి.

Also Read : ఆటోలో మరిచిపోయిన బంగారు గాజులు

ఓ సివిల్ కేసులో మ‌హంతేష్‌ను సంగీత ఇబ్బందుల‌కు గురి చేసింది. అదును కోసం ఎదురు చూసిన మ‌హంతేష్.. శ‌నివారం మ‌ధ్యాహ్నం సంగీత‌పై న‌డిరోడ్డుపై దాడి చేశాడు. ఆమె చెంప‌ల‌పై కొడుతూ.. క‌డుపు భాగంగా బ‌లంగా త‌న్నాడు. అత‌న్ని త‌ప్పించుకునేందుకు అక్క‌డున్న కుర్చీని అడ్డు పెట్టుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. సంగీత‌పై బ‌లంగా త‌న్నాడు మ‌హంతేష్‌. ఈ కేసులో మ‌హంతేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube