ఫిజియో థెరపీ సెంటర్ ప్రారంభించిన మంత్రి కోప్పుల

ఫిజియో థెరపీ సెంటర్ ప్రారంభించిన మంత్రి కోప్పుల

1
TMedia (Telugu News) :

ఫిజియో థెరపీ సెంటర్ ప్రారంభించిన మంత్రి కోప్పుల

టి మీడియా, మే 28,హైదరాబాద్ : బన్సీలాల్ పేటలో ఉన్న “హోం ఫర్ డిసబుల్డ్”ను మంత్రి కొప్పుల సందర్శించి ఫిజియోథెరపీ సెంటరును ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హోం చరిత్ర, నిర్వహణ గురించి మంత్రి కొప్పుల ఫాదర్ జేవియర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.దివ్యాంగులు, అనాథలకు ఆశ్రయం కల్పించేందుకు1933లో ఈ హోంను నెలకొల్పినట్లు, దాతలు ఇచ్చే నిధులతో దీన్ని నిర్వహిస్తున్నామని ఆయన మంత్రికి వివరించారు.తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని, అభినందించారని జేవియర్ గుర్తు చేసుకున్నారు.

Also Read : పట్టణప్రగతి ని పక్కాగా అమలు చేయాలి

ఇందులో ప్రస్తుతం 100 పురుషులు, 260మంది మహిళలు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.వీరిలో కొందరికి టైలరింగ్, ఎంబ్రాయిడరీ నేర్పిస్తున్నామని, ఆలనాపాలనతో పాటు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.ఈ సందర్భంగా మంత్రి హోం ఆవరణను పరిశీలించారు, పలువురితో ముచ్చటించారు, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.ఈ హోం నిర్వహణకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఫాదర్ జేవియర్ కు మంత్రి కొప్పుల హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్టీవెన్ సన్, బిషప్ నెహేమియా, క్రిస్టియన్ ప్రముఖులు శంకర్ లూక్, జీవన్, బెనహర్, డాక్టర్ శ్రవణ్, సదానంద్, అలెగ్జాండర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube