కాపు- మున్నూరు కాపు అలై- బలై .

0
TMedia (Telugu News) :

టీ మీడియా అక్టోబర్;19 మణుగూరు .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక బీజేపీ మండల అధ్యక్షుడు ధూళిపూడి శివప్రసాద్ సికింద్రాబాద్ బోయినపల్లి రాజరాజేశ్వరి గార్డెన్ లో జరిగిన కాపు మున్నూరు కాపు అలై బలై కార్యక్రమానికి హాజరైనారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో అరాచక పాలన కొనసాగుతుందని కెసిఆర్ పాలన అంతం అయ్యే రోజు దగ్గరలో ఉంది అని ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలంగాణ లో వచ్చే ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అని దీమా వ్యక్తం చేశారు. బిజెపి కార్యకర్తలు నాయకులు రెట్టింపు ఉత్సహం తో పని చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి పినపాక బిజెపి మండల అధ్యక్షుడు ధూళిపూడి శివ ప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిసాన్ మెర్చా వైస్ ప్రెసిడెంట్ పటేల్ వెంకట నారాయణ పాల్గొన్నారు.

Pinapaka BJP Mandal President Dhulipudi Shivaprasad attended the Kapu Munnur Kapu Alai Balai program at secunderabad.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube