పాలిచ్చే తల్లులకు పైనాపిల్‌ వల్ల ప్రయోజనాలెన్నో!

పాలిచ్చే తల్లులకు పైనాపిల్‌ వల్ల ప్రయోజనాలెన్నో!

0
TMedia (Telugu News) :

పాలిచ్చే తల్లులకు పైనాపిల్‌ వల్ల ప్రయోజనాలెన్నో!

లహరి, మార్చి 10, ఆరోగ్యం : పైనాపిల్‌ తినడానికి చాలామంది ఇష్టపడరు. మరీ ముఖ్యంగా పాలిచ్చే తల్లులు ఏవో కొన్ని అపోహల వల్ల పైనాపిల్‌ని తినరు. అయితే పాలిచ్చే తల్లులు పైనాపిల్‌ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. మరి ఆ ప్రయో జనాలేంటో తెలుసుకుందామా..!సుమారు 165 గ్రాముల బరువుండే పైనాపిల్‌లో.. సుమారు 142 గ్రాముల నీటి నిల్వలుంటాయి. స్త్రీ శరీరంలో పాల ఉత్తత్తికి నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాలిచ్చే తల్లులు.. ఈ పండును గనుక తీసుకుంటే.. పాల ఉత్పత్తికి తోడ్పడ్డమే కాకుండా.. ప్రసవానంతరం ఎదురయ్యే సమస్యల్ని కూడా ఇది పరిష్కరిస్తుంది.ప్రసవానంతరం చాలామంది తల్లులకు మలబద్దక సమస్యనెదుర్కొంటారు. పైనాపిల్‌ని తీసుకుంటే.. మలబద్దక సమస్య తీరుతుంది. ఈ పండులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శిశువు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Also Read : డ్రైవింగ్‌ సమయంలో మెదుడు ఎలా పనిచేస్తుందంటే..?

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube